రంగమత్త క్యారెక్టర్ కన్నా పవర్ ఫుల్ రోల్ లోఅనసూయ …

పుష్ప సినిమా నుండి అనసూయ లుక్ రిలీజ్...   


         

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చివరి హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమాను ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. ఇప్పటికే పుష్ప సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ , మరియు సునీల్ లుక్ ని రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను పెంచింది .. పుష్ప సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. పుష్ప సినిమా విషయంలో డైరెక్టర్ సుకుమార్ మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు , అలానే ఈ సినిమాలో సునీల్ లుక్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది ..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది . ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది , ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు గురించి సుక్కు టీమ్ ఒక్కొకటి రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి పెంచుతున్నారు .. తాజాగా ఈ సినిమా లో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్నది .. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా లో అనసూయ రంగమత్త క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించింది , తాజాగా సుకుమార్ పుష్ప సినిమాలో కూడా యాంకర్ అనసూయ కు పుష్ప సినిమా లో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారు , ఈ సినిమాలో అనుసూయ నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నది .. ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయని అనే పాత్రలో అనసూయ కనిపించనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో ఆమె డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఊర మాస్ లుక్ లో కనిపించింది .. ఈ లుక్ లో అనుసూయ చాలా గంభీరంగా కనిపిస్తోంది , ‘రంగస్థలం’ సినిమాలో అనసూయకు రంగమ్మత్త వంటి గుర్తుండి పోయే పాత్ర ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు ‘పుష్ప’ చిత్రంలో ఆమె కెరీర్ లోనే గుర్తు ఉండిపోయే డిఫెరెంట్ రోల్ ఇచ్చినట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధము అవుతుంది …