బిడ్డా ఇది నా అడ్డా… అల్లు అర్జున్ వార్నింగ్

పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ రిలీజ్

     

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి కి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . పుష్ప సినిమా టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎందుకు చెప్పారో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో మటుకు సాంగ్స్ , ఫైట్స్ , లొకేషన్స్ , హీరోయిజం , బన్నీ క్యారెక్టర్ లో సుకుమార్ ఎక్కడ తగ్గట్లేదు .. పుష్ప సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ చేసి , మూడు సాంగ్స్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం , ఆర్య , ఆర్య 2 సినిమాల తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రావడం అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి .

అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులు పుష్ప సీనిమా గురించి గోల చేస్తున్నారు .. పుష్ప సినిమా సబ్జెక్ట్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్ నటిస్తున్నది .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఈ క్రమంలో ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే నాల్గో పాట ను నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది సుకుమార్ టీమ్ ..ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది .. పుష్ప సినిమా నుండి వస్తున్న నాల్గో సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా అభిమానులను అలరించనుంది . సుకుమార్ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఒక స్టైల్ ఉంది అలానే మాస్ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు .. మొత్తానికి నవంబర్ 19న పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు …