పుష్ప రాజ్ అరాచకం మాములుగా లేదు…

 ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ హై వోల్టేజ్ యాక్షన్...

   

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి … వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా సుకుమార్ తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు .. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. .ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే అద్భుతమైన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో అల్లు అర్జున చాలా పవర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఈ సినిమాలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి .. అలానే ట్రక్ డ్రైవర్ గా అల్లు అర్జున నటన సూపర్బ్ గా ఉంది . అల్లు అర్జున యాక్టింగ్ లోని మరో కోణాన్ని సుకుమార్ బలే ప్రెజెంట్ చేసారు , ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లోనూ , మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లోను మంచి రెస్పాన్స్ వస్తుంది .. అదే విధంగా ఈ ట్రైలర్ లో అనసూయ , మరియు సునీల్ డైలాగ్స్ మరియు వారి లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు .ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన ఫహద్ ఫాసిల్ ట్రైలర్ చివరి షాట్ లో మంచి విలనిజం తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు . పుష్ప ట్రైలర్ కు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ వస్తుంది , అలానే ఈ ట్రైలర్ తో సినిమా మీద ఒక్క సారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి .డైరెక్టర్ సుకుమార్ -అల్లు అర్జున పడిన కష్టం ట్రైలర్ లో కనబడుతుంది .. అలానే మైత్రి మూవీ మేకర్స్ సినిమా విషయంలో ఖర్చు కు ఏమాత్రం వెనుకాడలేదు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది .. పుష్ప సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇంత అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ బాగా సంతోసపడుతున్నారు ..

.