అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను మూవీ లేటెస్ట్ అప్ డేట్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ – ఎఆర్ మురగదాస్ , మరియు వేణు శ్రీరామ్ ,ప్రశాంత్ నీల్ , వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రాబోతున్నాయి అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి .. ఇక అసలు విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ ప్రిన్స్ మహేష్ బాబు కోసం ఒక స్టోరీ ని రెడీ చేశారు , ఆ స్టోరీని మహేష్ బాబు కి వినిపించగా కొద్దీ పాటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు .. సుకుమార్ మహేష్ బాబు ప్రాజెక్ట్ ఆగిపోయిన తరువాత సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టారు అలా పుష్ప సినిమా స్టార్ట్ అయింది .. పుష్ప సినిమా మొదటగా ఒక పార్ట్ తీద్దాము అని సుకుమార్ అనుకున్నారు , కానీ స్టోరీ లెంగ్త్ ఎక్కువ ఉండటంతో రెండు పార్ట్ లు గా తెరకెక్కిస్తున్నారు . .. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయనున్నాడు అని సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తోంది .. పుష్ప సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. అయితే సడెన్ గా ఈ లోపు బోయపాటి శ్రీను పేరు వినిపించింది , ఇక అసలు విషయానికి వెళ్ళితే బోయపాటి శ్రీను అఖండ సీనిమా తరువాత తమిళ్ స్టార్ సూర్య తో సినిమా చేయనున్నాడు అని ,అలానే కన్నడ స్టార్ యష్ కోసం స్టోరీ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి .. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం కన్ఫర్మ్ గా బన్నీ.. బోయపాటి కాంబో లో మూవీ ఉంటుందిని అనుకుంటున్నారు ..బన్నీ -బోయపాటి కాంబోలో అయిదేళ్ల క్రితం సరైనోడు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . బన్నీ కెరీర్ లో ఈ సినిమా మాస్ హిట్ అందుకోవడమే కాకుండా హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..బోయపాటితో మరోసారి సరైనోడు రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను బన్నీ చేస్తాడని చాలా నెలలుగా సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి .. అయితే ఈ విషయము మీద అల్లు అర్జున్ కానీ , డైరెక్టర్ బోయపాటి శ్రీను కానీ క్లారిటీ ఇవ్వలేదు .. ఇక పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న మూవీ బోయపాటితోనా లేదా వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమాను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా బన్నీ సినిమా చేయాల్సి ఉంది. ఇంకా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించి ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా మాస్ మసాలా మూవీగా నిలిచి బన్నీ కెరీర్ లోనే ఒక మంచి సినిమాగా నిలిచింది. అలాంటి సినిమానే మళ్లీ బన్నీ కోరుకుంటున్నారు .. బోయపాటి ఇప్పటికే బన్నీ కోసం అలాంటి కథను కూడా రెడీ చేశాడని వార్తలు వచ్చాయి ..అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అయితే పక్కాగా ఉంటుంది , అది పుష్ప సినిమా తరువాత ఉంటుందా లేక ఐకాన్ సినిమా తరువాత ఉంటుందా అనేది తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే

Leave a Reply