గీత ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు కరుణ కుమార్…

గీత ఆర్ట్స్ లో డైరెక్టర్ కరుణకుమార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ …

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్‌ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రివెంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “రంగస్థలం ” ఈ సినిమా కూడా వాస్తవా సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. “పలాస 1978 ” సినిమా ఎనౌన్స్ చేస్తూ , మోషన్ పోస్టర్ , మరియు క్యారెక్టర్స్ పరిచయము చేస్తూ ఒక్కక్కరి లుక్ రిలీజ్ చేసి , ఈ సినిమా గురించి భారీ అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పలాస సినిమా క్యారెక్టర్స్ పరిచయం కోసం డైరెక్టర్ పూరి , మరియు సుకుమార్ , ముందుకు వచ్చి బాగా ప్రమోట్ చేశారు .. మొదటి సినిమా నే విభిన్నమైన స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కరుణకుమార కు ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా , ప్రేక్షకుల దగ్గర నుంచి , మరియు ఇండస్ట్రీ లో నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు ..

“పలాస 1978 ” సినిమా డీసెంట్ హిట్ తరువాత డైరెక్టర్ కరుణకుమార చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు .. పలాస సినిమా చుసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ సినిమా బాగుంది అని మెచ్చుకొని , గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యాలి అని కోరి అడ్వాన్స్ ఇచ్చారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..పలాస 1978 వంటి డీసెంట్ హిట్ తరువాత , డైరెక్టర్ కరుణకుమార కు చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి , కానీ ఇండస్ట్రీ స్లో అండ్ స్టడీ పద్దతిని ఫాలో అయి ,కొంత గ్యాప్ తీసుకొని ,హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కించారు .. సుధీర్ బాబు చివరిగా చేసిన “వి ” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది .. అలానే పలాస సినిమా తరువాత డైరెక్టర్ కరుణకుమార్ ఈ సారి మంచి కమర్షియల్ సినిమా చేద్దాము అని డిసైడ్ అయి , హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా డైరెక్ట్ చేశారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ టాక్ తెచ్చుకుంది .. శ్రీదేవి షోడా సెంటర్ లాంటి హిట్ సినిమా తరువాత డైరెక్టర్ కరుణ కుమార్ మల్లి కొంత గ్యాప్ తీసుకొని , బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు .. డైరెక్టర్ కరుణ కుమార్ – ఈ సారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సీనిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు .. గీత ఆర్ట్స్ బ్యానర్ , టాలెంటెడ్ డైరెక్టర్స్ , మరియు కొత్త డైరెక్టర్స్ ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు , ఇక పలాస దర్శకుడు కరుణ కుమార్ తో జీఏ2లో సినిమా త్వరలో ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పలాస సినిమా చూసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ కరుణకుమార కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .. మొత్తానికి అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కరుణ కుమార్ దర్శకుడిగా సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు- విద్య మాధురి ఈ చిత్రానికి నిర్మాతలు.