ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం రంగంలోకి దిగిన బోయపాటి శ్రీను ..

‘అఖండ మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచిన బోయపాటి టీమ్..

బోయపాటి శ్రీను ది – నందమూరి బాలకృష్ణ ది హిట్ కాంబినేషన్ .. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గస్ట్ హిట్స్ అందుకున్నాయి .. . బాలకృష్ణ – బోయపాటి సినిమా అంటే బాలయ్య అభిమానుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి , బాలయ్య తో సినిమా అంటేనే , బోయపాటి శ్రీను ముందు నుండి పక్కా ప్లానింగ్ తో ఉంటారు , బాలయ్యను ఎలా చూపించాలి , డైలాగ్ దగ్గర నుండి టెక్నీషియన్ , ఆర్టిస్ట్స్ , మ్యూజిక్ విషయంలో ముందు నుండి డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు .. అఖండ సినిమాకు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , ట్రైలర్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి నందమూరి అభిమానుల్లో ట్రైలర్ కు మంచి స్పందన లభించింది ..ఈ సినిమాను , ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. సింహ, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా మేకింగ్ విషయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు … తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు బాలయ్య అభిమానుల్లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అఖండ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ను సైతం స్పీడ్ గా చేయాలి అని నిర్మాతలు గట్టిగా భావిస్తున్నారు ..అఖండ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న ట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా , రాబోతున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి .. ప్రస్తుతం ఎన్టీఆర్ విదేశీ యాత్ర లో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు ..అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి … ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన నేచురల్ స్టార్ నాని.. ఇటీవల బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి నాని వచ్చాడు. దీంతో బాలయ్య, నాని ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. మొత్తానికి అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నందమూరి అభిమానులకు కనుల పండుగ గా ఉండేందుకు బోయాపాటి శ్రీను పక్కా ప్లానింగ్ తో
ఉంటున్నారు అని తెలుస్తుంది ..