12 ఘంటల్లో 15 మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్ సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్…

తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ తమిళ ట్రైలర్ నిన్న గురువారం డిసెంబర్ 30న 6:30 నిలకు విడుదలైంది. కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న ‘వాలిమై’ ప్రపంచవ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో ఈ వ్యూస్ తో తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కానుంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే 3 నిమిషాల 5 సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు… హిందీ హిట్ ‘పింక్’ను తమిళంలో ‘నెర్కొండ పార్వై’గా తెరకెక్కించారు.అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు.

ట్రైలర్ లో ప్రతి ప్రేము గ్రాండ్ గా ఆకట్టుకుంటోంది. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తున్నాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! ‘వలిమై’ సినిమా షూటింగులో కూడా అజిత్ గాయపడ్డారు. లేటెస్టుగా విడుదల అయిన ట్రైలర్ చూస్తే ఆయన ఎందుకు గాయపడ్డారు? యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది ఆడియ‌న్స్‌కు ఈజీగా అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్, కార్తికేయ మధ్య మైండ్ గేమ్.. పోరాటాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు తమిళ ట్రైలర్‌ గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే కోటి యాభై లక్షల వీక్షణలు దక్కించుకుందని సోనీ మ్యూజిక్‌ సంస్థ వెల్లడించింది.ట్రైలర్‌ విషయానికొస్తే.. బైక్‌ ఛేజింగ్‌, పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అజిత్‌, కార్తికేయ.. ఇద్దరి లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజిత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌ హంగామా ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఉన్నట్టు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. దోపీడీలు చేసే ముఠా నాయ‌కుడుగా కార్తికేయ క‌నిపించ‌నున్నారు. ధూమ్ స్టైల్లో బైక్స్‌పై వ‌స్తూ దోపీడీలు చేస్తుంటారు. ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్ గూజ్ బ‌మ్స్ తెప్పిస్తున్నాయి. బైక్ స్టంట్స్ అన్నీ క‌ళ్లు ఆర్పినీయ‌డం లేదు. ఈ సినిమాతో కార్తికేయుకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఇటు తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషాల్లో కూడా విడుదల కానుంది. ఇది అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.