ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 టైటిళ్లను గెలుచుకున్న విజేతలు

హైదరాబాద్, నవంబర్ 6, 2023: తెలంగాణకు చెందిన బి రమేష్ చంద్ర, మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా గాడ్‌బోలే ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023లో విజయం సాధించారు. రమేష్ చంద్ర 21.1 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 13 నిమిషాల 10 సెకన్లలో పరుగుపెట్టి హాఫ్ మారథాన్ ఛాంపియన్‌గా నిలిచారు. సతీష్ కుమార్ (1.15:50) , పీయూష్ మసానే (1.16:56) ఈ విభాగంలో మిగిలిన రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.

మహిళల్లో, 28 ఏళ్ల ప్రజక్తా గాడ్‌బోలే హాఫ్ మారథాన్ ను ఒక గంట 23 నిమిషాల 45 సెకన్లలో అధిగమించారు. తద్వారా భారతదేశపు అగ్ర శ్రేణి మారథాన్ రన్నర్‌లలో ఒకరిగా తన ఖ్యాతిని నొక్కి చెప్పింది. ఆమె తర్వాతి స్థానాల్లో ప్రీను యాదవ్ (1.24.46), తేజస్విని ఉంబ్కానె (1.25:11) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

క్రికెట్ దిగ్గజం మరియు ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్, సచిన్ టెండూల్కర్ తెల్లవారుజామున జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో 8,000 మందికి పైగా రన్నర్‌లు పాలన్నారు. NEB స్పోర్ట్స్ నిర్వహించిన హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 దక్షిణాదిలో అతిపెద్ద రన్నింగ్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ రన్ ముగిసిన తరువాత సచిన్, భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి హాఫ్ మారథాన్ విజేతలను సత్కరించారు.

“ఈ ఎడిషన్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ విజేతలను నేను అభినందిస్తున్నాను. ఇంత పెద్ద స్థాయిలో రన్నర్లు పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా వుంది. విజేతలకు మాత్రమే కాకుండా, అన్ని విభాగాలలో రన్ ఏజ్‌లెస్, రన్ ఫియర్‌లెస్ అనే సంకల్పంతో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను, ”అని టెండూల్కర్ అన్నారు.

“టైటిల్ స్పాన్సర్‌గా HHMలో భాగం కావడం మాకు ఆనందంగా ఉంది. భవిష్యత్ ఎడిషన్‌లలో దీన్ని మరింత పెద్దదిగా చేయడమే మా లక్ష్యం”అని ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి & సీఈఓ విఘ్నేష్ షహానే అన్నారు. “

టైమ్డ్ 10K పోటీ చేతన్ కుమార్ (0.34:21) మరియు భరత్ సింగ్ (0.35:13) మధ్య ఫైట్ గా కనిపించింది, చేతన్ కిరీటాన్ని కైవసం చేసుకోగా నిఖిల్ ఎరిగిలా (0.35:24) మూడో స్థానంలో నిలిచారు.

మహిళల్లో, షీలు యాదవ్ (0.41:34) విజేతగా నిలిచారు, 7 నిమిషాల భారీ తేడాతో ఆమె టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముస్కాన్ (0.48:29) మరియు యాంకీ దుక్పా (0.50:04) ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచారు.

RESULTS
Half Marathon

Men: 1. B Ramesh Chandra (1:13.10); 2. Satish Kumar (1:15:50); 3. Piyush Masane (1:16:56)

Women: 1. Prajakta Godbole (1:23:45); 2. Preenu Yadav (1:24:46); 3. Tejaswini Umbkane (1:25:11)

10K

Men: 1. Chetan Kumar (0.34:21); 2. Bharat Singh (0.35:13); 3. Nikhil Erigila (0.35:24)

Women: 1. Sheelu Yadav (0.41:34); 2. Muskan (0.48:29); 3. Yankey Dukpa (0.50:04)

Leave a Reply