విభిన్నమైన స్టోరీ తో ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్ …
డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'అద్భుతం' " ట్రైలర్ ..
తేజ సజ్జా గురించి తెలియాని వారుండరు , బాలనటుడిగా 1998 మెగా స్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయము అయ్యారు .. బాలనటుడిగా సీనియర్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించారు … బాల నటుడిగా తేజ సజ్జా చేసిన చివరి రెండు సినిమా అస్త్రం , మరియు బాస్ . 2019 లో డైరెక్టర్ నందిని రెడ్డి – సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓ బేబీ ,సోషియా ఫాంటసీ కామెడీ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ..ఈ సినిమా తోనే తేజ సజ్జా యాక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు , అయితే ఈ సినిమాలో సమంత దే లీడ్ రోల్ , తేజ సజ్జా ఈ సినిమాలో రాకీ”, బేబీ మనవడు గా సమంత తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు , ఓ బేబీ సినిమా తరువాత ప్రశాంత వర్మ డైరెక్షన్ లో ‘జాంబీరెడ్డి’ సినిమా తో సోలో హీరో గా ఎంట్రీ ఇచ్చి ,సక్సెస్ అందుకున్నారు .. జాంబీరెడ్డి’ సినిమా హిట్ అందుకున్నాక ,ఇటీవలే ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టొరీ’ తో పలకరించారు. ఇష్క్: నాట్ ఏ లవ్ స్టొరీ’ సినిమా తరువాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు ..
ప్రస్తుతం ‘హను-మాన్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న తేజ.. ”అద్భుతం” అనే చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉంది . ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్19న డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అద్భుతం’ ట్రైలర్ చూస్తుంటే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఫాంటసీ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.అద్భుతం’ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే – మాటలు సమకూర్చారు. రథన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. చంద్ర శేఖర్ మొగుల్ల – సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరించారు. డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి…