ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

“రంగస్థలం ” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ వినయ విధేయ రామ” . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . . వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు . రాజామౌళి బాహుబలి సినిమా తరువాత చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో రామ్ చరణ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది .. రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ఆచార్య సినిమాలో క్యామియో రోల్ లో నటిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ , మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022ఫిబ్రవరి 4న విడుదల కానున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్బంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో ఆచార్య సినిమాలో ఉండే పాట ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాలో మొదటి సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది . తాజాగా ఈ సినిమా లో మరో సాంగ్ రిలీజ్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ను చరణ్ మంచి డాన్స్ స్టెప్పులతో రూపొందించారు. ఇంతకు ముందు వచ్చిన లాహె లాహె పాట ఎలా అయితే టెంపుల్ సిటీలో చిత్రీకరించారో.. ఈ పాటను కూడా అదే పరిసరాల్లో చిత్రీకరించినట్లుగా నీలాంబరి పాట ప్రోమోను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఇక నీలాంబరిగా పూజా హెగ్డే కూడా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. ఈ సాంగ్ ను . నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీపావళి తర్వాత రోజు అంటే రేపు ఈ పాట పూర్తి నిడివి తో మన ముందుకు వస్తున్నది … ఆచార్య సినిమా ఇంత ఆలస్యం అయినా కూడా అభిమానుల్లో ఈ సినిమా గురించి కొంత అయిన ఆసక్తి తగ్గలేదు. లాహె లాహె పాట మణిశర్మ సంగీత సారధ్యంలో వచ్చి భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. , మరి ఈ నీలాంబరి పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా లు ఆలపించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించారు. ఈ పాట లో రామ్ చరణ్ డాన్స్ చాలా ఈజ్ తో ఉంది .. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు … సినిమాలో ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు…