థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఆరడుగుల బుల్లెట్…

2019 లో మ్యాచో స్టార్ గోపీచంద్ డైరెక్టర్ తీరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “చాణుక్య” , ఈ సినిమాలో గోపీచంద్ రా ఏజెంట్ గా కనిపించ్చారు . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ అండ్ మేకింగ్ వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది గాని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . చాణుక్య సినిమా తరువాత , గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకొని చాలా కధలు విన్నారు , ఫైనల్ గా సంపత్ నంది చేప్పిన ఐడియా కు ఒకే చేయడం జరిగింది అలా సీటిమార్ సినిమా మొదలైయింది ..సంపత్ నంది ది గోపీచంద్ ది హిట్ కాంబినేషన ,గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గౌతమ్ నంద ” సినిమా యావేరేజ్ టాక్ తెచ్చుకున్న , ఈ సినిమా లో గోపీచంద్ యాక్టింగ్ కు , మరియు సంపత్ నంది స్టోరీ కి టేకింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు .. గోపిచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి .. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ ఫస్ట్ టైమ్ నటించడం , అలానే ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ ,మేకింగ్ వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది .. సీటిమార్ సినిమా తరువాత గోపీచంద్ తనకు గతంలో లక్ష్యం , లౌక్యం వంటి హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో ముచ్చటగా హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు , ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి .. ఈ క్రమంలో సీటిమార్ సినిమా తరువాత గోపీచంద్ నటించిన చిత్రం ”ఆరడుగుల బుల్లెట్” సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది .. ఇక అసలు విషయానికి వెళ్ళితే , నాలుగేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదల అవ్వలేదు .. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చాలా లెట్ గా రిలీజ్ అవ్వడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి , అసలు ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. ఎట్టకేలకు ఈ వార్తలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమాను అక్టోబర్ 8న ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో గోపీచంద్ క్యరెక్టర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది , ఈ సినిమాకు దర్శక రచయిత వక్కంతం వంశీ కథ – స్క్రీన్ ప్లే అందించగా , అబ్బూరి రవి దీనికి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు – బ్రహ్మానందం – జయ ప్రకాష్ రెడ్డి – చలపతిరావు – రమా ప్రభ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘సీటీమార్’ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపీచంద్..