ముగ్గురు ముద్దుగుమ్మల 3రోజెస్ …

అడల్ట్ కంటెంట్ తో వస్తున్న 3రోజెస్...

                 

ప్రేక్షకులు ఎప్పటికి అప్పుడు కొత్త రకమైన , సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు , ప్రేక్షకుల అభిరుచి మారింది , మాస్ సినిమాలు ఇష్టపడే వారు ఉన్నారు , కంటెంట్ సినిమాలు ఇష్టపడేవారు ఉన్నారు ..ప్రేక్షకులు సినిమా విషయంలో ఎప్పటికి అప్పుడు అప్ డేట్ అవుతున్నారు .. ఒకప్పుడు సినిమా అంటేనే థియేటర్స్ లో చూడాలి అని ఉండేది , కానీ ఇప్పుడు కాలం మారింది , సినిమా స్థాయి కూడా పెరిగింది , థియేటర్స్ కోసం సినిమా తీసే దర్సకులు ఉన్నారు , అలానే ప్రస్తుతం ,ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం సినిమాలు వెబ్ సిరీస్ చేసే దర్శకులు ఉన్నారు , ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది . ముఖ్యంగా మహమ్మారి కరోనా సమయంలో ప్రేక్షకులు ధియేటర్స్ లో సినిమాలు చూడటం వీలు కాదు , కాబట్టి నిర్మాతలు కూడా , తమ సినిమాను ,ఓటీటీ లోనే రిలీజ్ చేశారు .. ,ఓటీటీ ప్లాట్ ఓటీటీ సంస్థ నుండి వస్తున్న సినిమాలు , మరియు వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు .. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడానికి కృషి చేస్తోన్న ఓటీటీ ‘ఆహా’. బ్లాక్ బస్టర్ సినిమాలు – స్పెషల్ టాక్ షోలతో పాటుగా ఒరిజినల్ సిరీస్ లనూ స్ట్రీమింగ్ పెడుతోంది. ఇప్పుడు ”3 రోజెస్” అనే సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. డైరెక్టర్ మారుతి ఇప్పటి వరకు ఓటీటీ లోకి అడుగు పెట్టలేదు , గోపీచంద్ తో పక్కా కమ్మర్షియల్ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్న మారుతి “3 రోజెస్ ” షో తో డిజిటల్ లోకి అడుగు పెడుతున్నారు .. ఆహా లో బాలకృష్ణ తో అల్లు అరవింద్ ఒక షో చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంటే , డైరెక్టర్ మారుతి కూడా “3 రోజెస్ సిరీస్ తో షో రన్నర్ గా వ్యవహరిస్తూ మరింత ఆనందాన్ని అందించడం విశేషం .. “3 రోజెస్” టీజర్ లో పాయల్ రాజ్ పుత్ – ఈషా రెబ్బా – పూర్ణ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘3 రోజెస్’ ఫస్ట్ లుక్ మరియు ముగ్గురు హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 12న ఈ సిరీస్ ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ ని పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 3 రోజెస్’ సిరీస్ ఓటీటీ కంటెంట్ కావడంతో అడల్ట్ టచ్ తో పాటుగా కాస్త శృతి మించిన డైలాగ్స్ ఉన్నాయి .. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో అనేది చూడాలి …