‘లెవల్ అప్’ ప్రోగ్రాం ద్వారా విజయవంతంగా రాణిస్తున్న 11 మంది మహిళా ఆంత్రప్రెన్యూయర్లు..

Level Up program

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,మార్చి 4, 2023: భారతదేశంలోని ప్రముఖ కోవర్కింగ్ కమ్యూనిటీలలో ఒకటైన 91 స్ప్రింగ్‌ బోర్డ్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జిఎఫ్‌ఎస్) భాగస్వామ్యంతో హైదరాబాద్ నుండి పదకొండు మంది మహిళా పారిశ్రామికవేత్తలను తమ ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్ మొదటి గ్రూప్ కోసం ఎంపిక చేశారు. ఇది దేశవ్యాప్త వర్చువల్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. ఇది మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చ డానికి, వారు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ మహిళా పారిశ్రామికవేత్తలు ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణం, సాఫ్ట్‌ వేర్, ఇంటర్నెట్, రవాణా, ఇతర పరిశ్రమల రంగాలలో టెక్ వ్యాపారాలను నడుపుతున్నారు. కొంతమంది ఉత్తమ పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వం   పొంద డం వల్ల వారు ప్రయోజనాలు పొందగలుగుతున్నారు.  ఇది వారు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు, తమ బ్రాండ్లను భారతీయ స్టార్టప్ వ్యవస్థలో ప్రముఖమైనవిగా చేసేందుకు   సహాయపడుతుంది.

గూగుల్, ఇతర ప్రముఖ సంస్థల నుండి మహిళా నాయకత్వ స్టార్టప్‌లకు నిష్ణాతులైన సలహాదారుల నుం డి దృక్పథాలు, మార్గదర్శకత్వాన్ని అందించడం ‘లెవల్ అప్ ప్రోగ్రామ్’లక్ష్యం. సలహాదారులు మార్గదర్శ కులుగా వ్యవహరించారు, ఆయా సవాళ్ళపై మహిళా వ్యవస్థాపకులతో కలసి పని చేశారు. వారి వ్యాపారా న్ని X నుండి 10x వరకు పెంచేందుకు వ్యూహాలను రూపొందించారు. 71 మంది సలహాదారులు   వ్యాపా రాలను నిర్మించడానికి, వృద్ధి చేయడానికి మాస్టర్‌క్లాసెస్, పీర్ మీటప్‌లు, సాధనాలు, నైపుణ్యాన్ని మూడు నెలలు అందించారు. ఈ గ్రూప్ 1 ఆగస్టు 2022 లో ప్రారంభించబడింది. 366 కి పైగా దరఖాస్తుల నుండి 183 మంది మహిళా పారిశ్రామికవేత్తలు షార్ట్‌ లిస్ట్ చేయబడ్డారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25 న ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ద్వారా, ఫార్మల్ నెట్‌వర్కింగ్‌లో 12+ గంటలతో పాటుగా మొత్తం 200+ గంటలు వ్యవస్థాపకులను మార్గనిర్దేశం చేయడానికి వెచ్చించారు. పీర్ మీటప్‌లు భారతదేశం అంతటా 91 స్ప్రింగ్‌బోర్డ్ హబ్‌లలో జరిగాయి. ఈ సందర్భంగా 91 స్ప్రింగ్‌బోర్డ్ సిఇఒ ఆనంద్ వేమూరి ఇలా అన్నారు: ‘‘ఇటీవల మహిళా పారిశ్రామికవేత్త లు స్వావలంబన సాధించడం, స్వతంత్రంగా మారడం మేం చూశాం. మన ప్రభుత్వం కూడా వారికి మద్ద తు ఇస్తోంది.  మేం 91 స్ప్రింగ్‌బోర్డ్ ద్వారా మా వంతు కృషి చేస్తున్నాం. 91 స్ప్రింగ్‌బోర్డ్ అభ్యాస అవకాశాల ద్వారా వృద్ధిని పెంపొందించడాన్ని నమ్ముతుంది. లెవల్ అప్ కోసం GFS తో ఈ సహకారం వ్యవస్థాపకుల విశ్వాసాన్ని పెంచుతుంది. తమ ప్రయాణంలో వారికి సహాయం చేస్తుంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల నుండి మాకు అధిక స్పందన వచ్చింది. మహిళా వ్యవస్థాపకులకు, తెలివిగా జీవించడానికి వారికి గల ఆశయాలకు మధ్యన అంతరాన్ని తగ్గించడానికి ఒక అడుగు ముందుకేసినట్లయింది’’.

గూగుల్ ఫర్ స్టార్టప్స్ పార్ట్ నర్ షిప్ మేనేజర్ నికోల్ యప్ ఇలా అన్నారు: “విశ్వవ్యాప్తంగా సంబంధిత, స హాయక పరిష్కారాలను నిర్మించడం, కంపెనీలు, ఆవరణ వ్యవస్థలు నిర్మించడం అనేది చేకూర్పుతో కూ డుకున్నదిగా, వైవిధ్యభరితంగా ఉండాలని గూగుల్‌  లో మేం విశ్వసిస్తుంటాం. మహిళా వ్యవస్థాపకులు ఇ ప్పటికీ మొత్తం మీద చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ ప్రాతినిధ్యాన్ని సులభతరం చేసే మరియు ప్రారంభించే కార్యక్రమాలు చాలా సమయానుకూలంగా ఉన్నాయని, అవి చాలా ముఖ్యమైనవని  మేం భా విస్తున్నాం. దీని కోసం 91 స్ప్రింగ్‌బోర్డ్‌ తో సహకరించడానికి మేం సంతోషిస్తున్నాం. మా ప్రోగ్రామ్‌ల ద్వారా మేం భారీ సంఖ్యలో మహిళలను  చేరుకోవాలని, స్వదేశీ వ్యాపారాలను మెరుగుపరచాలని కోరుకుంటు న్నాం. ”

కోహార్ట్ 1 కు వచ్చిన సానుకూల స్పందన నేపథ్యంలో లెవల్ అప్ ప్రోగ్రామ్ కోహోర్ట్ 2 మార్చిలో ప్రారంభమ వుతుంది, జూలై 2023 వరకు కొనసాగుతుంది. ‘లెవల్ అప్’ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తలు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు: కోహార్ట్ II దరఖాస్తు ఫారం.

మహిళా పారిశ్రామికవేత్తలు భారతీయ ఆర్థిక వ్యవస్థ పరివర్తన ప్రయాణంలో భాగంగా ఉంటున్నారు. ప్రారం భంలో మహిళా వ్యవస్థాపకుల పరంగా ఈ పయనం మందకొడిగా ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలు గా విజయవంతమైన వ్యాపారాలను స్థాపించే మహిళల సంఖ్య భారతదేశంలో పెరిగింది. అందువల్ల, వారికి మద్దతు ఇవ్వడం మంచి, మరింత డైనమిక్ వ్యవస్థాపకత వాతావరణానికి దారితీస్తుంది, ఉద్యోగాలు సృష్టి స్తుంది, వ్యాపారాలకు కొత్త దృక్పథాలను ఇస్తుంది.

 Level Up program

List ofwomen entrepreneurs selected from Hyderabad for the Level Up program

Sr. NoName of the FounderName of the CompanySector
01Sailaja AkkalaInfinizy Global Innovations Pvt LtdSoftware & Internet
02Rachna GujralSkyliah Petcare Pvt LtdPet food
03Dr.M.SailajaSamrudhi w2wSocial Enterprise
04Humera NishatWhatIsMyGoalEducation
05Astha SinghMuuzzer (Wonderquill Business Solutions Pvt. Ltd)Media & Entertainment
06Priyanka TayiKULA studioSustainable Fashion Tech
07Geetha RavaliGaddipatiChargekartTransportation & Logistics
08Vijaya Lakshmi ARigveda TechnologiesHealthcare
09Rajeswari KalyanamFridaywallProfessional Services
10Lavanya SunkariLauriko Private LimitedHealthcare
11Shwetha TirumanisettiThe Nilah CollectiveRetail

Leave a Reply