రీసైక్లింగ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన రీ సస్టైనబిలిటీ,దాదూస్ స్వీట్స్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,5 జూన్ 2023: పెరుగుతున్న ఉష్ణోగ్రత లు , పర్యావరణ ఆందోళనల నడుమ సంస్థలు , వ్యక్తులు బాధ్యతాయుతమైన పరిరక్షణకు తమ అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు.  వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేయడానికి వ్యాపారాలు వినూత్నమైన వ్యూహాలను ఎంచుకున్నప్పుడు #GreenTransformation సాధ్యమవుతుందని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ ReSL , Dadu’s Sweets ప్రదర్శించాయి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం స్ఫూర్తితో,కుచ్ మిథా హో జాయే’ అనే భారతీయ భావజాలంతో హైదరాబాద్, పూణే అంతటా దాదూస్  అవుట్‌లెట్‌ల ముందు చిన్న కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. రీసైక్లింగ్ కేంద్రాలకు పంపబడే  స్వీట్ బాక్స్‌లను వినియోగదారుల నుండి  సేకరించేందుకు ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బాక్స్ లు అందించిన  కస్టమర్‌లకు  దాదూస్  నుండి 10% తగ్గింపును స్వీట్స్  పై అందిస్తారు 

“మా బాధ్యతాయుతమైన రీసైక్లింగ్ ప్రయత్నాల ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల ప్రభావాన్ని చూసేందుకు .ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.  మేము ఏర్పాటు చేసిన  కియోస్క్‌ల వద్ద డిపాజిట్ చేసిన ప్రతి పెట్టెను  బాధ్యతాయుతంగా రీసైక్లింగ్ చేయనున్నాము. రాబోయే తరాలకు పచ్చని, మరింత స్థిరమైన భవిష్యత్తును ప్రోత్సహించే ప్రచారంలో భాగం కావడం నిజంగా సంతోషకరమైన విషయం” అని  రీ సస్టైనబిలిటీ –  సీఈఓ  శ్రీ మసూద్ మల్లిక్ అన్నారు.

“మేము వేడుకలను సృష్టించే వ్యాపారంలో ఉన్నాము, మా పెట్టెలు సృష్టించే అసంఖ్యాక చిరునవ్వులను చూడటం ఆనందంగానే వున్నా ,  ప్రపంచంలోని వ్యర్థాలకు అవి విపరీతంగా జోడించబడుతున్నాయని  తెలుసుకోవడం కూడా కలత చెందుతుంది. ఈ కార్యక్రమం  పర్యావరణానికి తిరిగి ఇవ్వడానికి, రేపటి కోసం మా వంతు కృషి చేయడానికి మా ప్రయత్నం.  నగరం లో మా స్టోర్స్ వద్ద  ఏర్పాటు చేయబడిన కియోస్క్‌లలో వాడిన స్వీట్ బాక్స్ లు అందించటం ద్వారా   10% తగ్గింపును పొందండి! ” అని   దాదూస్ స్వీట్స్  మేనేజింగ్ డైరెక్టర్,శ్రీ రాజేష్ దాదు అన్నారు.