హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో ప్రత్యేకమైన “లైవ్ భుజియా అనుభవం”తో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన హల్దీరామ్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, మే 11, 2023 :ప్రముఖ భారతీయ స్వీట్లు, స్నాక్స్ తయారీదారు అయిన హల్దీరామ్ 11 మే 2023న హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో సరికొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ అవుట్‌లెట్  కొత్త మార్కెట్‌లలోకి కొనసాగుతున్న హల్దీరామ్ విస్తరణను, నాణ్యమైన ఉత్పత్తులు, అసాధారణమైన కస్టమర్ సేవలను అందించడంలో దాని నిబద్ధతను సూచిస్తుంది. .

మూసారాంబాగ్‌లో అత్యంత సందడిగా ఉండే ప్రాంతంలో ఉన్న హల్దీరామ్స్ రెస్టారెంట్ కస్టమర్‌లకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. ఆల్-టైమ్ ఫేవరెట్ రాజ్‌కచోరీ, చోలే భాతురే, పావ్ భాజీ, పాలక్ పట్టా చాట్, వైవిద్యమైన దోస రుచులు, కాజు కట్లీ , ప్రత్యేకమైన “లైవ్ భుజియా అనుభవాలు సైతం అందిస్తుంది. ఇక్కడ వినియోగదారులు జనాదరణ పొందిన స్నాక్స్ ను వాస్తవం గా తయారు చేయడాన్ని చూస్తారు. దానిని తాజాగా ఆస్వాదించవచ్చు. ఆవిష్కరణ, వినియోగదారుల అనుభవం , నాణ్యత పట్ల హల్దీరామ్ నిబద్ధతకు ఇది నిదర్శనం గా నిలుస్తుంది.

ఈ కొత్త స్టోర్‌ను హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ శివ కిషన్ జీ అగర్వాల్ ప్రారంభించారు, అనంతరం మాట్లాడుతూ “ హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో మా కొత్త స్టోర్‌ను వైభవం గా ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము.

హల్దీరామ్ కు ఇది ముఖ్యమైన మైలు రాయి గా నిలుస్తుంది. వినియోగదారులకు రుచికరమైన భారతీయ ఆహారం, స్నాక్స్, స్వీట్‌లతో పాటు లీనమయ్యే, మరపురాని అనుభూతిని అందించడం మా లక్ష్యంగా ఉంది. ‘లైవ్ భుజియా ఎక్స్‌పీరియన్స్’ని మా వినియోగదారులకు మొదటిసారిగా అందిస్తుండటం పట్ల మేము సంతోషిస్తున్నాము, హల్దీరామ్ రుచులు ఆస్వాదించడానికి వారిని ఆహ్వానిస్తున్నాము” అని అన్నారు.

భారతీయ స్నాక్స్, స్వీట్ల పరిశ్రమలో 80 సంవత్సరాలకు పైగా అనుభవంతో, హల్దీరామ్ భారతదేశం, వెలుపల విస్తృతమైన , నమ్మకమైన కస్టమర్ బేస్‌తో ఇంటి పేరుగా మారింది. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వంటి కొత్త మార్కెట్‌లలోకి కంపెనీ విస్తరించడం దాని నిరంతర విజయానికి, ప్రజాదరణకు నిదర్శనం.

మూసారాంబాగ్‌లోని కొత్త హల్దీరామ్ స్టోర్ హైదరాబాద్‌లో కంపెనీకి చెందిన 16వ స్టోర్, భారతదేశం అంతటా మొత్తం 200+ స్టోర్‌లను సంస్థ కలిగి ఉంది .