IGCSE రిజల్ట్స్ లో టాపర్స్ గా నాచారం డీపీఎస్ కేంబ్రిడ్జ్ లెర్నర్స్..

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,మే 24,2023: మార్చి 2023 సిరీస్ కేంబ్రిడ్జ్ పరీక్షల్లో మెచ్చుకోదగిన IGCSE ఫలితాలను సాధించిన డీపీఎస్ నాచారం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ గ్రేడ్-10 విద్యార్థులు అద్భుతమైన విజయం సాధించారు. చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ శ్రీమతి పల్లవి, సీఓఓ మల్కా యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతా రావు, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఎఫ్. శాంతి ఆంథోనీలు మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

కేంబ్రిడ్జ్ కరిక్యులమ్ విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఐజీసీఎస్సీ కోసం విభిన్న సబ్జెక్ట్ లను ఎంచుకోవచ్చని నిర్ధారిస్తుంది. ఈ సిరీస్‌లో 14 విభిన్న విషయాలను అందించామని యాజమాన్యం చెప్తోంది. వాటిలో విద్యార్థులు సాధించిన ఫలితాల వాళ్ల పట్టుదలకు నిదర్శనం. మొత్తం ఆరు సబ్జెక్టులలో A స్టార్ సాధించిన ఈ స్కూల్ టాప్ పెర్ఫార్మర్ గా శ్రీరామ్ శ్రీగిరి నిలిచినందుకు గర్విస్తున్నట్లు ప్రిన్సిపాల్ అంటున్నారు.

  • శ్రీరామ్ శ్రీగిరి ఇంగ్లిష్ లో 90శాతం, మ్యాథ్స్ లో 97శాతం, ఫిజిక్స్ లో 97శాతం, కెమిస్ట్రీలో 97శాతం, బయాలజీలో 97శాతం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో 95శాతం సాధించాడు.
  • హేమంత్ చారీ కనపర్తి ఇంగ్లిష్ లో 90శాతం సాధించాడు.
    -కెవిన్ విరాల్ షా మ్యాథ్స్ లో 97శాతం సాధించాడు.
  • ధ్రితి రెడ్డి మొలుగు కంబైన్డ్ సైన్స్ లో 90శాతం, స్పానిష్ లో 90శాతం సాధించింది.
  • 2022 అక్టోబర్, నవంబర్ ఐజీసీఎస్సీ ఎగ్జామ్స్ సిరీస్ లో నమ్రతా రాయికల్, కెవిన్ విరాల్ షా, ఆకరపు ఓం హన్షల్ కుమారస్వామి ఐసీటీ లో 90శాతం సాధించారు.
  • హేమంత్ చారీ కనపర్తి గ్లోబల్ పర్స్పెక్టివ్ లో 91శాతం సాధించాడు.
  • చాగంటి శర్వాణీ హిరన్మయి హిందీలో 90శాతం సాధించింది.
    స్కూల్ విద్యార్థుల్లో 91శాతం మంది ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇన్ ఎడ్యుకేషన్ (ICE) అవార్డులు, మెరిట్ స్థానాలను అందుకున్నారు.

నమ్రత రాయికల్, మనోగ్న నారాయణ్ దాస్, బల్లా సౌమిల్, అకారపు ఓం హన్షల్ కుమారస్వామి, వేప నీల్ రావు, బోగ్లే అక్షిత్ రెడ్డి, చాగంటి శర్వాణి హిరణ్మయి, కెవిన్ విరాల్ షా, ఎల్లముల కృష్ణ సాయి రెడ్డి, వేపూరి ధీరజ్ శివ కేశవ్ కుమార్ మెరిట్ హోల్డర్లు గా నిలిచారు.

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లోని కేంబ్రిడ్జ్ విద్యార్థులు కఠోర శ్రమ, సంపూర్ణ సంకల్పం, అవిశ్రాంత ప్రయత్నంతో ఈ విజయం సాధించినట్లు యాజమాన్యం చెప్తోంది. మొత్తం మీద డీపీఎస్ నాచారం జంట నగరాల్లో అగ్రశ్రేణి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ K-12 స్కూల్‌గా అవతరించింది. అనుభవజ్ఞులైన జాతీయ, అంతర్జాతీయ మార్గదర్శకులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిబద్ధతతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.