ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ విడుదల

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, జూన్ 8,2023:పర్యావరణ పరిరక్షణ కోసం భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిందే. దాన్ని బాధ్యతగా భావించి మంచి పనులు చేయాలంటే, అన్నింటికన్నా ముందు పెద్ద మనసుండాలి. అలాంటి మంచి మనసుతో ఎకో భారత్ అనే ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను తయారు చేస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య.

2023, జూన్ 5వ తేదీన ఈ ఎకో భారత్ ప్రాజెక్ట్ లో భాగంగా శ్రీ అవని ఎంటర్ప్రైజ్ తో కలిసి బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్ ని విడుదల చేశారు. ఆ సందర్భంగా గద్వాల్ జిల్లాలోని హిమాలయా బాంకెట్ హాల్లో దీనికి సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్ ని విడుదల చేసి, పర్యావరణ పరిరక్షణ, వాటికోసం చేయాల్సిన కృషి గురించి చర్చ జరిగింది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎకో భారత్ వంటి సోషల్ ఇనిషియేటివ్ లో భాగం అవుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు శ్రీ అవని ఎంటర్ ప్రైజెస్ పార్ట్ నర్స్ కె. విజయ్ కుమార్, కేఎం శ్రీకాంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందర్నీ ఉద్దశించి మల్కా యశస్వి మాట్లాడారు. పర్యావరణం, సమాజానికి మంచి జరగాలన్న ఉధ్దేశంతో తాము ఈ ఎకో భారత్ ద్వారా బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఆయన అన్నారు.

అలాగే ఈ కార్యక్రమానికి గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఓఓ మల్కా యశస్వి, సినీనటులు చిత్రం శీను, చిట్టిబాబు, గడ్డం నవీన్, సింధు, మాలవిక, గద్వాల్ పీఏసీఎస్ చైర్మన్ ఎమ్మే శుభమ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా వైస్ చైర్మన్ సరోజమ్మ రమేశ్ నాయుడు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, గద్వాల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ అతిథులుగా పాల్గొన్నారు.