2023 ఆర్థిక సంవత్సరంలో రూ.70.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన అబాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్

తెలుగు సూపర్ న్యూస్,ముంబై, మే 27, 2023: ప్రముఖ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ 2023 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికానికి (క్యూ4) బలమైన ఆర్థిక పనితీరును ప్రకటించింది. కంపెనీ వివిధ ఆర్థిక కొలమానాలలో గణనీయమైన వృద్ధిని ప్రదర్శించింది. త‌ద్వారా పరిశ్రమలో కీ ప్లేయ‌ర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.70.3 కోట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో వ‌చ్చిన రూ.61.8 కోట్ల నికర లాభంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం అంత‌కుముందు ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 15 శాతం పెరిగి రూ.76 కోట్లకు చేరింది.

2022 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.638.62 కోట్లతో పోలిస్తే 2023 ఆర్థిక సంవ‌త్స‌రంలో 80.2 శాతం వృద్ధితో రూ.1,150.97 కోట్లుగా నమోదైంది. ఏజెన్సీ ఆదాయం గ‌త ఏడాది కంటే 83 శాతం పెరిగి 2023 మార్చి నాటికి రూ.43 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ ఒక్కో షేరుకు రూ.14.81గా ఉంది. నికర ఎన్‌పీఏసున్నా వద్ద కొనసాగ‌డం ద్వారా.. కంపెనీ బలమైన రిస్క్ మేనేజ్ మెంటును కొనసాగిస్తోంది.

త‌న బలమైన ఫలితాలతో పాటు, అబాన్స్ హోల్డింగ్స్ తన వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలను వివరించింది. భవిష్యత్తు వృద్ధిని నడిపించడం, ఈ దిగువ పేర్కొన్న కీలక రంగాలలో త‌న నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.