ఐఎండీబీలో అత్యునత శిఖరానికి చేరుకున్న సమంత రూత్ ప్రభు టాప్ టెన్ టైటిల్స్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 27,2023:తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విభిన్న నేపథ్యాలున్న పాత్రలను పోషిస్తూ భారతీయ ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో మంచి పేరు సంపాదించుకుంది సమంతా రూత్ ప్రభు. ఇటీవలే  విడుదలైన శాకుంతలం సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. గతంలో రాజమౌళి  ‘ఈగ‘ సినిమాతో హిట్ కొట్టిన ఆమె, ప్రైమ్ వీడియో యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’  రెండో సీజన్ ద్వారా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ‘సిటాడెల్: ఇండియా’ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.

 ఇవి సమంతకు  పేరు తెచ్చిన  ఐఎండీబీ (IMDb) లోని పది ఉత్తమ చిత్రాలు:

1. ది ఫ్యామిలీ మ్యాన్ – 8.7

2. మహానటి – 8.4

3. సూపర్ డీలక్స్ – 8.3

4. రంగస్థలం – 8.2

5. కత్తి – 8.1

6. మనం – 7.9

7. 24 – 7.8

8. గూఢచారి – 7.8

9. ఈగ – 7.7

10. ఏ మాయ చేసావె – 7.7

Leave a Reply