తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు సామాజిక సంబంధిత టెలిప్లేల గొప్ప నిధిని తీసుకువస్తున్న జీ థియేటర్

జులై 5,2023:’గుణేగర్’, ‘సర్ సర్ సరళ,’ ‘గుడియా కి షాదీ’ వంటి హిట్‌లు, సుపరిచిత ముఖాలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. మహోన్నత సాంస్కృతిక వారసత్వం ,శక్తివంతమైన కళాత్మక కమ్యూనిటీకి ప్రసిద్ధి చెందినది తెలంగాణ. నాణ్యమైన వినోదం కోరుకుంటూ, ఆ తరహా వినోదం కోసం ఆసక్తి గా ఎదురుచూసే అశేష ప్రేక్షకులనూ కలిగి ఉంది.

ఈ అంతరాన్ని పూరించాలనే ఉద్దేశ్యంతో, థియేటర్ మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్, తమ ప్రదర్శన పట్టికను విస్తరించి, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలో తమ అత్యంత ప్రసిద్ధ టెలిప్లేలను (టెలివిజన్ కోసం రికార్డ్ చేయబడిన నాటకాలు) తీసుకు వస్తామని ప్రకటించింది. ఈ టెలిప్లేలు కన్నడలో కూడా అందుబాటులో ఉంటాయి.

ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడిన చారిత్రాత్మక కథనాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, లీగల్ డ్రామాలు మరియు సామాజిక సంబంధిత మానవ కథలలో చాలా వరకు తెలుగు మాట్లాడే ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రసిద్ధ నటులు ఉన్నారు.

‘పురుష్’లో నటించిన అశుతోష్ రానా, 2019 ‘కల్కి’తో సహా 14 కంటే ఎక్కువ తెలుగు చిత్రాలలో కనిపించారు. ‘సర్ సర్ సరళ’ నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించి, అందులో నటించిన మకరంద్ దేశ్‌పాండే 2022లో ‘RRR’ మరియు ‘తగ్గేదేలే ‘ వంటి చిత్రాలలో కనిపించారు. ‘గుణేగర్’ మరియు ‘గుడియా కి షాదీ’ చిత్రాల్లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ 2018లో ‘విజేత’తో సహా పలు తెలుగు సినిమాల్లో కూడా పనిచేశారు.

జీ థియేటర్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ‘గుణేగర్’, ‘రిస్తోం కా లైవ్ టెలికాస్ట్’, అగ్నిపంఖ్’, ‘రాంగ్ టర్న్’, ‘సర్ సర్ సరళ’, ‘ఇంటర్నల్ అఫైర్స్ ‘, ‘మా రిటైర్ హోతీ హై’, ‘కోర్ట్ మార్షల్’, ‘సచ్ కహూన్ తో’ , ‘శ్యామ్ కీ మమ్మీ’వంటి వాటిలో గజరాజ్ రావ్, హిమానీ శివపురి, మితా వశిష్ట్, రాజీవ్ ఖండేల్‌వాల్, గోవింద్ నామ్‌దేవ్, అహనా కుమ్రా వంటి ప్రసిద్ధ కళాకారులను కూడా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని ప్రేక్షకులు చూడవచ్చు. ఈ బహుళ-శైలి, ఆకర్షణీయమైన నాటకాలలో, వారు సార్వత్రిక సమస్యలు మరియు సంఘర్షణలతో పోరాడుతున్న అనేక రకాల సాపేక్ష పాత్రలను కూడా కలుస్తారు.

జీ స్పెషల్ ప్రాజెక్ట్స్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ శైలజా కేజ్రీవాల్ మాట్లాడుతూ , “రంగస్థలం కేవలం ఒక భాషకు పరిమితం కాదు. ఇది సార్వత్రిక ఆందోళనలతో పాతుకుపోయింది మరియు మానవులందరితో, వారికోసం మాట్లాడుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి సాంస్కృతిక చైతన్యవంతమైన రాష్ట్రాలకు మా సమర్పణలను అందుబాటులోకి తీసుకురావటానికి మేము వ్యూహరచన చేయడానికి ఇది ఒక కారణం.

‘కోర్ట్ మార్షల్’ ,’పురుష్’ వంటి శక్తివంతమైన టెలిప్లేలు లేదా సెక్సిజం మరియు పితృస్వామ్యానికి సంబంధించిన ఒక కోపమైన వ్యాఖ్య గా కనిపించే ‘గుడియా’ కి షాదీ వంటి సామాజిక కామెడీని ఏ భాషాపరమైన అవరోధం నిరోధించలేదని నిర్ధారించడానికి మేము ప్రయత్నిస్తున్నాము…” అని అన్నారు.

ఈ కొత్త కార్యక్రమం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంటెంట్ అసలు భాషలో ప్లే అయినప్పటికీ, చందాదారులు తమ రిమోట్ ద్వారా హిందీ నుండి తమ భాష (తెలుగు)కి సులభంగా మారే అవకాశం కలిగి ఉంటారు.( డిష్ టీవీ & D2h ఎల్లో బటన్; ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ- బ్లూ బటన్).

ఈ నాటకాలు జూలై 2023 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు ‘సౌత్ స్పెషల్ థియేటర్’ పేరుతో ఒక ప్రత్యేక విభాగంలో ప్రసారం చేయబడతాయి. ఈ నాటకాలు తెలుగులో డిష్ టీవీ & డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్,ఎయిర్‌టెల్ థియేటర్‌లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply