తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన శాఖ నిర్వహించిన ఏడో గార్డెన్ ఫెస్టివల్ 2022లో మొదటి బహుమతి గెలుచుకున్నగౌడియం పాఠశాల
హైదరాబాద్, ఏప్రిల్ 18, 2023: తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన శాఖ నిర్వహించిన ఏడో గార్డెన్ ఫెస్టివల్ 2023లో పాఠశాలల విభాగంలో తాము మొదటి బహుమతి గెలుచుకున్నట్లు గౌడియం పాఠశాల సగర్వంగా ప్రకటించింది. హరిత వాతావరణాన్ని పెంపొందించాలన్న తమ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని పాఠశాల తెలిపింది.
విద్యార్థులలో పర్యావరణ అవగాహనను పెంపొందించడం, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం అవసరమని గౌడియం పాఠశాలలో మేము నమ్ముతున్నాము. మా ఫౌండర్ & డైరెక్టర్ శ్రీమతి కీర్తి రెడ్డి హరిత వాతావరణాన్ని సృష్టించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి బలమైన మద్దతుదారు. ఈ లక్ష్యసాధనకు మొక్కలు నాటడం, ప్రాంగణం అంతా హరితమయం అయ్యేలా చూడటం, విద్యార్థులు, సిబ్బందిలో పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడం లాంటి పలు కార్యక్రమాలను అమలు చేశాం.
మా కృషిని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యానశాఖకు కృతజ్ఞతలు. ఫెస్టివల్ లో పాల్గొన్న అనేక ఇతర సంస్థల నుంచి గౌడియం పాఠశాల విజేతగా ఎంపికైంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకోవడానికి కారణమైన పాఠశాలలోని హార్టికల్చర్ టీమ్ కృషిని, అంకితభావాన్ని అభినందిస్తున్నాం. పచ్చదనాన్ని కాపాడేందుకు కృషి చేసి, మా పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మా విద్యార్థులను చూసి గర్విస్తున్నాం.
ఉత్తమవిద్యను అందించడం, పర్యావరణాన్ని పెంపొందించడంలో మా నిబద్ధత అచంచలం. హరిత వాతావరణాన్ని సృష్టించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. మా విద్యార్థులు వారి నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనేలా మేం ప్రోత్సహిస్తాం. హార్టికల్చర్ విభాగంలో విజయం సాధించడం అన్ని రంగాల్లో రాణించేలా నిరంతరం కృషి చేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. ఈ కేటగిరీలో ట్రోఫీని ఏప్రిల్ 15న పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి అందజేశారు.