“మిస్టర్ కళ్యాణ్”చిత్రం రివ్యూ

Mr Kalyan (2023) movie review and rating

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,మార్చి 10,2023:శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్. అలా అతని వృత్తిలో ఉన్న కళ్యాణ్ కు కొన్ని క్యారెక్టర్లు తారసపడతాయి. ఆ పాత్రలు కళ్యాణ్ తో కొన్ని ఎమోషన్స్ ను పంచుకుంటాయి. అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అతని మాట వినడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సారిక (అర్చన) కు దొరికిపోతాడు. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్, చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మిస్టర్ కళ్యాణ్ సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా సాగుతుంది. సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. హీరోయిన్ అర్చన బాగా నటించింది, సారిక పాత్రలో ఒదిగిపోయింది. హీరో ప్రయాణంలో తనకు పరిచయం అయిన నాలుగు పాత్రలు మనలోని ఎమోషన్స్ ను తట్టి లేపుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ర్ తప్పకుండా కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించారు.

దర్శకుడు పండు కు మిస్టర్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా చేశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. సాహిత్యం కూడా తనే ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు. కెమెరామెన్ నానాజి, ఎమ్.వి.గోపి వీరి పనితనం అద్భుతం వారి కెమెరా వర్క్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిందని చెప్పక తప్పదు.

డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి , ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి మిసర్ట్ కళ్యాణ్ సినిమాను నిలబెట్టారు. ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమాను చాలా నీట్ గా కట్ చేశారు. అతని వర్క్ బాగుంది. ఈ సినిమాకు ఫైట్స్ బిగ్ ప్లస్, షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన నాలుగు పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ కళ్యాణ్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మంచి కథ బలం ఉన్న సినిమాలు నిర్మాత తీయాలని కోరుకుందాం. వినోదం తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి.

సినిమా: మిస్టర్ కళ్యాణ్
విడుదల తేది: మార్చి 10, 2023.
నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు
డైరెక్టర్: పండు
నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్

చివరిగా: మిస్టర్ కళ్యాణ్ అందరిని మెప్పిస్తాడు.

రేటింగ్: 3/5

సాచి సినిమా రివ్యూ & రేటింగ్ !!!

Saachi movie review

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, మార్చి3, 2023:విధాత ప్రొడక్షన్స్ పై ఫిల్మ్ స్టార్స్ మేకర్ సత్యానంద్ గారి సమర్పణ లో రొటీన్ చిత్రాలకు భిన్నంగా బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం “సాచి”. ఈ చిత్రాన్ని ఉపేన్ నడిపల్లి,వివేక్ పోతగోని నిర్మాణ సారధ్యములో వివేక్ పోతగోని దర్శకుడిగా రూపొందించారు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
ఆడ మగ అనే తేడా లేకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. కుల వృత్తికి మించిన పని లేదు అనే సిద్ధాంతం ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. దైర్యంగా ముందుకు వెళ్ళాలి అధైర్య పడి వెనకడుగు వేయకూడదు అని ఈ సాచి సినిమాలో చెప్పడం జరిగింది. సంజనా రెడ్డి (సాచి) ఒక బార్బర్ షాప్ నడుపుతూ ఉంటుంది, ఆ అమ్మాయి తండ్రి చక్రపాణి (అశోక్ రెడ్డి) అనారోగ్యంతో ఉన్నప్పుడు సాచి అన్ని తానై తండ్రికి సేవలు చేస్తుంది. అనుకోని సందర్భంలో తండ్రిని కొల్పతోంది సాచి. ఒక పిరికి అమ్మాయి మల్లిక భానవాత్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి ? చివరికి సాచి ఏం చేసింది వంటి విషయాలు తెలియాలంటే సాచి సినిమా చూడాల్సిందే.

కథనం:
మహిళా సాధికారతకు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సత్యానంద్ గారు సమర్పించగా వివేక్ పోతగోని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.

“సాచి నిజజీవిత కథ. బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధ. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్స్ గా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు. కెవి భరద్వాజ్ సంగీత దర్శకునిగా మంచి సాంగ్స్ తో పాటు గుడ్ రీ రికార్డింగ్ చేశారు. ప్రసన్న కుమార్ పాటలు, పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని మాటలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న వివేక్ పోతగోని తన ప్రతిభను కనబరిచారు.

సాచి సినిమా అత్యతం ఆసక్తికరంగా నడిచే సినిమా. ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని అంశాలను సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ముఖ్యంగా కులవృత్తి మించిన వృత్తి లేదు అనే పాయింట్ ను అందరికి అర్థం అయ్యే విధంగా బాగా చూపించారు.

చివరిగా: సాచి అందరిని ఆలోచింపజేసే సినిమా

రేటింగ్: 3/5