మిర్చి కాంబినేషన్ రిపీట్… త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

డార్లింగ్ ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ కొరటాల శివ “మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరెకెక్కిన సినిమా ఆచార్య .. ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఇక ఆచార్య మూవీ తరువాత డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే … కొరటాల శివ దర్శకుడు కాక ముందల పలు మూవీస్ కి రచయితగాను డైలాగ్ రైటర్ గా వర్క చేసాడు , అయితే రైటర్ గా ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ కి పని చేసిన కొరటాల శివ , కొంత గ్యాప్ తీసుకొని , 2013 లో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి , మిర్చి మూవీ తో డైరెక్టర్ గా మారారు .. ఫస్ట్ మూవీ ,ప్రభాస్ టెరిఫిక్ యాక్టింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ , మ్యూజిక్ సెంటిమెంట్ సీన్స్ అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఇక మిర్చి మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో కొరటాల శివ వెనెక తిరిగి చూసుకోలేదు కంటిన్యూ గా హిట్స్ అందుకుంటానే ఉన్నాడు .. ప్రభాస్ సినీ కెరీర్ లో మిర్చి మూవీ చాలా స్పెషల్ …. ఈ మూవీ లో ప్రభాస్ లుక్ , యాక్టింగ్ అన్నిటిని మార్చేసి , సరికొత్తగా ప్రెజెంట్ చేసి మెమరబుల్ ఇండస్ట్రీ హిట్ ని అందించాడు డైరెక్టర్ కొరటాలా శివ …….. మిర్చి మూవీ తో ప్రభాస్ – కొరటాల శివ ఫ్రెండ్ షిప్ బాగా క్లోజ్ అయింది … ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రిపీట్ అవుతున్నట్లుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి …

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం , డైరెక్టర్ కొరటాల శివ ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ ని కలిసినట్లు తెలుస్తుంది …… డార్లింగ్ ప్రభాస్ అభిమానులు కూడా ఈ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. ఇక డార్లింగ్ అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ చూడాలని ఎదురుచూస్తున్నారు .. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమా లు లైన్ లో ఉన్నాయి …ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ గురించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే రాలేదు .. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మాత్రం కొద్దిగా టైమ్ పడుతుంది. . ఎప్పటినుంచో ఈ కాంబోలో మిర్చి లాంటి సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు , అయితే డైరెక్టర్ కొరటాల శివ – ప్రభాస్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు చుడాలిసిందే…

మారుతీ దర్శకత్వం లో ప్రభాస్, అనుష్క … ఫాన్స్ కి పండగే…

టాలీవుడ్ లో నే బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గా వచ్చిన బాహుబలి , బాహుబలి 2 రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన ఇండియా స్టార్‏గా మారిన ప్రభాస్ ఆ తరువాత చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం … ఇక ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రాధే శ్యామ్ మూవీ తరువాత ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ కే, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు ..ఇక డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే . . ఈ మూవీని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిచబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి …

డైరెక్టర్ మారుతి – ప్రభాస్ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది .. ఇక మారుతీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని కాస్టింగ్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు .. ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి ఒకే అయినట్లు వార్తలు కూడా వచ్చాయి .. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ మరొకటి వినిపిస్తుంది .. నిశ్శబ్దం మూవీ తరువాత అనుష్క చాలా లాం మారుతీ కూడా అనుష్క ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది . మరి మారుతీ – ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న మూ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది అని వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …

ప్రభాస్ తో మారుతీ మూవీ ….గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు

ప్రభాస్ కి స్టోరీ వినిపించిన మారుతి

టాలీవుడ్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి సినిమాలకు యూత్ లో బాగా క్రేజ్ ఉంటుంది .. యూత్ పల్స్ , కామిడీ టైమింగ్ , కాన్సెప్ట్ సినిమాలు తీయాలన్న మారుతి రూటే వేరు , పాన్ ఇండియా సినిమాలు మధ్య చిన్న సినిమాలు వస్తున్న తరుణంలో పక్కాగా డైరెక్టర్ మారుతి సినిమా ఒకటి ఉంటుంది ..ప్రస్తుతం డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి ఒకరు . చిన్న సినిమాలతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు ..మారుతి సినిమాలు అంటేనే మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి అని నిర్మాతలు చెబుతుంటారు , రొటీన్ కి బిన్నంగా మారుతి స్టోరీస్ ఉంటాయి , మారుతి డైరెక్షన్ లో ఏ హీరో నటించిన వారికి బెస్ట్ సినిమా అవుతుంది ..

మారుతి – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ప్రతిరోజూ పండగే . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్ ” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్సుమెంట్ చేస్తున్నారు ..ప్రస్తుతము డైరెక్టర్ మారుతి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి , వాటిలో . గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ , మరియు సంతోష్ శోభన్ నటించిన ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా , సంతోష్ శోభన్ నటించిన మంచిరోజులు వచ్చాయి’ సినిమా దీపావళి పండుగన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది .. ఈ సినిమా తరువాత మాస్ హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్” సినిమాను తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , రిలీజ్ చేసి , గోపీచంద్ అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. ప్రస్తుతము చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమా తరువాత , మెగా స్టార్ చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి , తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .

డైరెక్టర్ మారుతి కెరీర్ మొదటి నుంచి మీడియం రేంజ్ హీరోలోతో సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు . మారుతి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ తో మాత్రమే ‘బాబు బంగారం” అనే సినిమా చేసారు.. ప్రస్తుతము డైరెక్టర్ మారుతి సీనియర్ హీరోల కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది .. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక స్టోరీ సిద్ధంచేయగా , తాజాగా మరో బాంబ్ లాంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి కూడా మారుతి ఒక లైన్ వినిపించాడనీ .. అది ఆయనకి బాగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనుకోవలసిందే. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి , చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి , అలానే ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి , అలానే డైరెక్టర్ మారుతి చేస్తున్న పక్కా కమ్మర్షియల్ సినిమా పూర్తి అయితే కానీ మరోక సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మొత్తానికి డైరెక్టర్ మారుతి ఒక్క పెద్ద స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం బాగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి సోషల్ మీడియా లో మారుతి – ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అన్న విషయం వైరల్ అవుతుంది .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే డైరెక్టర్ మారుతి ,పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్లే .మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళనుందో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే …

రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” విక్ర‌మాదిత్య క్యారెక్టర్ టీజ‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనూహ్య‌ స్పంద‌న‌

రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” విక్ర‌మాదిత్య

చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య గా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమ‌క‌థ గా మెష‌న్ పోస్ట‌ర్ ద్వారా రివీల్ అయ్యింది. విక్ర‌మాదిత్య ఎలా వుండ‌బోతున్నాడు..? ఏం చేయ‌బోతున్నాడు?. విక్ర‌మాదిత్య ఎవ‌రు..? అనే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం గా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య గా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్.

”నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడిని కాదు కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు. ఇప్పటి వరకు ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ ‘గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్’ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ విక్ర‌మాదిత్య టీజ‌ర్ తో “రాధే శ్యామ్” ఫ్లేవ‌ర్ టేస్ట్ చూపించారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్య శ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్‌కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు

టెక్నికల్ టీమ్: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ.. నిక్ పావెల్‌,
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ.. వైభ‌వి మ‌ర్చంట్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌..సౌండ్ ఇంజ‌నీర్‌.. ర‌సూల్ పూకుట్టి,
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

18 సవంత్సరాల కష్టం దాగి ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ ప్రస్థానం…

18 సవంత్సరాల కష్టం దాగి ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ ప్రస్థానం …

              

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచుకున్న ప్రభాస్ , ఆ తరువాత వరుసగా పాన ఇండియా సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు , లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఓం ప్రకాష్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెడుతున్నారు .. ఈ సందర్బంగా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ సినీ జర్నీ గురించి ఒక సారి రివైండ్ చేసుకుందాం .. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి వెనుక 18 సవంత్సరాల కష్టం ఉంది ..

20002 లో ప్రభాస్ జయంత్ సి పరాంజీ డైరెక్షన్ లో ఈశ్వర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు , ఈ ససినిమాతోనే ప్రభాస్ కృష్ణం రాజుకి సరి అయిన వారసుడిగా పేరు తెచ్చుకున్నారు .. ఈశ్వర్ సినిమా తరువాత , రెండవ సినిమా కే సూపర్ స్టార్ రజిని కి బాషా లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేష్ కృష్ణ కాంబినేషన్ లో రాగవేంద్ర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు , ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాగవేంద్ర సినిమా ప్రభాస్ కు నెగటివ్ రిసల్ట్ ఇచింది .. రెండొవ సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ అ తరువాత ఏం ఎస్ రాజు బ్యానెర్ లో శోబన్ డైరెక్షన్ లో వర్షం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్షం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది . ప్రభాస్ ఈ సినిమా తో నే మాస్ ఇమాజ్ , మరియూ లవర్ బాయ్ ఇమాజ్ క్రియేట్ చేసుకున్నాడు ..

2004 వర్షం సినిమా తో హిట్ అందుకొన్న ప్రభాస్ అ తరువాత మాస్ సినిమాల కూ కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బి గోపాల్ డైరెక్షన లో అడవి రాముడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు , ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడవి రాముడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాదించలేకపోయింది.. ఈ సినిమా తరువాత క్లాస్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో చక్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటివరకూ మాస్ ఇమేజ్ కోసం ఆరాట పడిన ప్రభాస్, ప్యూర్ క్లాస్ ఇమేజ్ కోసం చేసిన ఈ ప్రయోగం కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా రిజల్ట్ తేడా కొట్టింది కానీ చక్రం సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

వరసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి ప్రభాస్ వన్ టైం వండర్ మాత్రమేనా? కృష్ణంరాజు లెగసిని అతను ముందుకి తీసుకోని వేల్లగలడా అనే అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేస్తూ 2005లో ఛత్రపతి సినిమతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. జక్కన్న చెక్కిన ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రభాస్ ని వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. ఛత్రపతి చూసిన ప్రతి ఒక్కరు… ప్రభాస్ హైట్, ఫిజిక్, యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. సింపుల్ గా చెప్పాలి అంటే అసలు కమర్షియల్ సినిమా హీరో అంటే ఇలా ఉండాలి రా అనిపించాడు ప్రభాస్. రాజమౌళి ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ సినిమానే బాహుబలి సినిమా రూపొందడానికి మొదటి అడుగు.

రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా ఆ తర్వాత అతను తప్పకుండా ఫ్లాప్స్ ఫేస్ చేయాల్సిందే అనే మాట ఉంది కదా. సేంమ్ అలాగే ఛత్రపతి తర్వాత ప్రభాస్, కోలుకొలేని దెబ్బ తిన్నాడు.హిట్ అనే మాటే తెలియకుండా ప్రభాస్ దాదాపు అయిదేళ్ల గడిపాడు అంటే అతని కెరీర్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. అన్ని ఫ్లాప్స్ వస్తే ఏ హీరోకైనా మార్కెట్ కష్టం అవుతుంది కానీ ప్రభాస్ మార్కెట్ కి మాత్తరం ఎలాంటి నష్టం రాలేదు. కారణం ఒక్క సరైన కథ పడితే ప్రభాస్ బాక్సాఫీస్ దెగ్గర సృష్టించే కలెక్షన్ల సునామి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి….

అయిదేళ్ల పాటు సరైన హిట్ కొట్టకపోయినా, ప్రభాస్ మాత్రం అభిమానులకి ఎప్పటికీ గుర్తుండే పోయే క్యారక్టర్స్ లోనే కనిపించాడు. ముఖ్యంగా పౌర్ణమి, యోగి, మున్న లాంటి సినిమాలు చేసి కష్టాల్లో ఉన్న ప్రభాస్, బుజ్జిగాడు లాంటి మసాలా సినిమా చేసి తనలోని కొత్త నటుడిని ప్రేక్షకులకి చూపించాడు. బుజ్జిగా ప్రభాస్ చూపించిన ఈజ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ని అతని ఫాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. టిప్పర్ లారి వెళ్లి స్కూటర్ ని గుద్దుకుంటే ఎలా ఉంటదో తెలుసా? అనే డైలాగ్ అప్పట్లో రిసౌండ్ లా వినిపించింది. అన్నట్లు ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజినీ ఫ్యాన్ గా కనిపిస్తూ ఇంట్రడక్షన్ సీన్ కే సిక్స్ ప్యాక్ చూపించాడు.

బుజ్జిగాడు సినిమాలో స్టైలిష్ గా కనిపించిన ప్రభాస్, ఆ తర్వాత అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూ బిల్లా సినిమా చేశాడు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో డ్యూయల్ రోల్ ప్లే చేసిన ప్రభాస్, బిల్లా రంగాల పాత్రలకి అదిరిపోయే వేరిఎషణ్ చూపిస్తూ ప్రేక్షకులని మెప్పించాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే… బాలీవుడ్ సినిమా చూసినట్లు ఉంటుంది. హల్క్ ని చూసే ఉంటారు కదా ప్రభాస్ ని బిల్లాలో చూస్తే టాలీవుడ్ హల్క్ లాగే ఉంటాడు. అండ్ బిల్లా సినిమాలో ఉన్న మరో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్, ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి నటించడమే. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఫస్ట్ సినిమా ఇదే, అలాగే ప్రభాస్ అనుష్క కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే.

బుజ్జిగాడు సినిమాతో తన మేకోవార్ కి కారణం అయిన దర్శకుడు, ఈసారైన హిట్ ఇస్తాడేమో అనే నమ్మకంతో ప్రభాస్ పురితో కలిసి ఎక్ నిరంజన్ సినిమా చేశాడు కానీ అది కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తెలుగు ఆడియన్స్ ముందుకి ప్రభాస్ పూరిలు కలిసి బోంటి హంటర్ అనే కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా, ఎక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ డెబ్యు ఇచ్చింది.

యోగి నుంచి ఎక్ నిరంజన్ వరకూ అన్నీ కమర్షియల్ సినిమాలే చేసినా హిట్ మాత్రం దక్కకపోవడంతో ప్రభాస్, యూత్ ఫుల్ సినిమాలు చేసే కరుణాకరన్ తో కలిసి డార్లింగ్ మూవీ చేశాడు. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిన ఈ లవ్ స్టొరీ… దాదాపు అయిదేళ్ల తర్వాత ప్రభాస్ హిట్ కొట్టేలా చేసింది. ఈ మూవీ నుంచే ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అనడం మొదలు పెట్టారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరోసారి ప్రయోగం చేస్తూ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరథ్ తో మిస్టర్ పర్ఫక్ట్ సినిమా చేశాడు. క్లీన్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రభాస్ కి ఫిమేల్ ఫాలోఇంగ్ పెరిగేలా చేశాయి

బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చిన ప్రభాస్, మరో ప్రయోగం చేస్తూ ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కి ఛాన్స్ ఇచ్చాడు. బిల్లా తర్వాత ప్రభాస్ కృష్ణం రాజు కలిసి నటించిన ఈ రెబల్ సినిమా చాలా రోజుల డిలే అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఏకైక ప్రభాస్ సినిమా ఇదే అయ్యి ఉండొచ్చు. రెబల్ ఊహించని రిజల్ట్ ఇచ్చినా, ప్రభాస్ ఫాన్స్ మాత్రం థియేటర్స్ ల్ రచ్చ లేపారు. దానికి కారణం రెబల్ ఇంటర్వెల్ ఫైట్. టాలీవుడ్ బెస్ట్ ఫైట్ సీన్స్ అనే లిస్టు తీస్తే అందులో రెబల్ ఇంటర్వెల్ ఫైట్ తప్పకుండా ఉంటుంది.

రెబెల్ లాంటి డిసాస్టర్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ . ఆ తరువాత రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. మిస్టర్ ఫెరఫెక్ట్ వంటి కథలతో ఫ్యామిలీ హీరోగా మారుతున్న ప్రభాస్ కు సరి అయిన మాస్ హిట్ ఇచ్చాడు .. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది … మిర్చి సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ , ఆ తరువాత బాలీవుడ్ లో ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ జాక్సన్ సినిమా లో సాంగ్ లో సోనాక్షి సింహా తో కలిసి డాన్స్ చేశారు .. ఈ సాంగ్ మీకోసం

దర్శకదీరుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండొవ సినిమా బాహుబలి .. బిగ్గెస్ట్ స్టార్ కాస్టింగ్ , భారీ సెట్స్ , గ్రాండ్ విజువల్స్ , తో జక్కన్న చేసిన ఈ ప్రయత్నానికి ముందుగా అభినందించాలి .. టాలీవుడ్ లో నే బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గా వచ్చిన బాహుబలి , బాహుబలి 2 రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి ..

బాహుబలి సినిమా తో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ మర్కెట్స్ ఓపెన్ చేసిన ప్రభాస్ ఆ తరువాత కూడా పాన్ ఇండియా సినిమాలే చేద్దాము అనుకున్నాడు .. రన్ రాజా రన్ సినిమా తో టాలీవుడ్ లో కి అడుగుపెట్టిన ఒక యంగ్ డైరెక్టర్ సుజీత్ కు ప్రభాస్ ఈ సారి ఛాన్స్ ఇచ్చాడు .. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సాహు సినిమా టాలివుడ్ ప్రేక్షకులకు అర్ధం కాకపోయినా , సినిమా టేకింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రభాస్ డై హార్డ్ ఫాన్స్ ఫిదా అయిపోయారు .. మొత్తానికి ప్రభాస్ నటించిన సాహు సినిమా టాలీవుడ్ లో కలెక్షన్స్ అంత గా రాబట్టలేకపోయిన బాలీవుడ్ లో మాత్రం బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టగలిగింది ..

సాహు సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తరువాత కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలకె కమిట్ అయ్యాడు , ప్రస్తుతము రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా , మరియు మాహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కమిట్ ఒక సినిమా , అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తున్న “సలార్” సినిమా , మరియు ,సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో మరో సినిమాలకు కమిట్ అయి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .. ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటం అభిమానులకు గుడ్ న్యూస్ అయ్యినప్పటికీ , ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ మ్యారేజ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు .