నాగశౌర్య సినిమా – లేటెస్ట్ అప్ డేట్ …

        వరుడు కావలెను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘వరుడు కావలెను’.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సూర్య దేవర నాగవంశి నిర్మించారు.. ఈ సినిమా తో లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు .. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం హైదరాబాద్‌లో హీరో రానా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాగశౌర్యకు సరిగ్గా సరిపోయే టైటిల్‌ ఇది. తను చాలా అందంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఈ వరుడికి పెళ్లయిపోతుందని నమ్ముతున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘సినిమా పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి శౌర్య. దర్శకులకు ఏం కావాలన్నది తనకి బాగా తెలుసు. ఈ కథ అనుకున్నప్పుడు తనకే బాగుంటుందనుకున్నా. అందుకే స్క్రిప్ట్‌ తొలుత తనేకే చెప్పా’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చేసినందుకు చాలా గర్వపడుతున్నా. కుటుంబమంతా కలసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. ఈ చిత్రంలో మా నోటి నుంచి వచ్చిన మాటలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అదంతా గణేష్‌ రావూరి ఇచ్చిన సంభాషణల వల్లే. విశాల్‌ మంచి స్వరాలందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాలో ప్రతి ఒక్కరినీ చాలా అందంగా చూపించారు. నన్నెంత ప్రేమించిందో.. సినిమాని అంతే ప్రేమించింది లక్ష్మీ సౌజన్య అక్క. రీతూ చాలా బాగా చేసింది. ‘వరుడు కావలెను’ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. ఈ సినిమా తో నాగ శౌర్య పక్కాగా హిట్ అందుకుంటారు అని నమ్మకంగా ఉన్నారు ..