కొరటాల దర్శకత్వం లో అల్లు అర్జున్, ధనుష్ భారీ మల్టీస్టార్…

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది .. ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ ప్రారంబించింది డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. స్టోరీ నచ్చాలి , కధలో దమ్ము ఉండాలే గాని మన హీరోలు మల్టీ స్టారర్ సినిమా లు చేయడానికి ఎప్పుడు సిద్దమే .. ప్రస్తుతం డైరెక్టర్స్ ఆలోచనలు మారుతున్నాయి .. రొటీన్ మూవీస్ కు దూరంగా ఉంటూ , రియాలిటీ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు .. అలానే సినిమా ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే ….. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ హీరోలను బిగ్ స్క్రీన్ మీద ఒకే తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ఈ క్రమంలో నిర్మాతలు కూడా కాంబినేషన్స్ సెట్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు .. అయితే కొన్ని కాంబినేషన్స్ త్వరగా సెట్ అవుతాయి , కొన్ని సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది .. ఇక డైరెక్టర్స్ రూట్ మారుస్తూ రెగ్యులర్ మూవీస్ కి దూరంగా ఉంటూ విభిన్నమైన , కొత్తరకమైన కధలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు ….మల్టీ స్టారర్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు .. ఇద్దరు స్టార్ హీరోలను న్యాయం చెయ్యాలి .. ఇద్దరి పాత్రలు బ్యాలెన్స్ చేయాలి ..ఈ ఫార్ములాని ..డైరెక్టర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఇద్దరి హీరోలను బాగా బాలన్స్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు .. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ అవ్వడంతో , డైరెక్టర్స్ అందురు మల్లి మల్టీ స్టారర్ సినిమా లు చెయ్యాలనే ఆలోచనల మీద ఉన్నారు .. రాజామౌళి బ్రాండ్ సినిమాగా ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ క్రేజ్ నడుస్తుండగానే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సెట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ..

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు …. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ….ఈ క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో దాన్నికంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు .. పుష్ప 2 మూవీ తరువాత కూడా పాన్ ఇండియా మూవీస్ తోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. , కొరటాల శివ దర్శకత్వంలో ధనుష్-అల్లు అర్జున్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమా కు బేస్ పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. మరి ఈ మల్టీ స్టారర్ మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే ….

త్రివిక్రమ్ ఆధ్వర్యంలో ధనుష్ – వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం‌ సార్‌…(తెలుగు) వాతి…(తమిళం) ప్రారంభం…

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.చిత్ర నాయకా,నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. ప్రముఖ నిర్మాతలు డా: కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందచేశారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్స్ స్లోగన్తో ఇటీవల ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి.కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి.వి. ప్ర‌కాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడిచేయనున్నట్లు తెలిపారు నిర్మాతలు.