భీమ్లా నాయక్ విడుదల వాయిదా?

సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల హవా. అభిమాన హీరో ల సినిమాలు విడుదల అవుతాయి. ప్రతి సంక్రాంతి కి భారీ సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఎక్కువ… ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానున్నది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే…కాని ఇప్పుడు నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం… నిర్మాతలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో భీమ్లా నాయక్ ను థియేటర్స్ లో కి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారట.

చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. కానీ ఆచార్య లో కొన్ని ఎపిసోడ్స్ ను రీ షూట్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆచార్య మార్చి నెలలో విడుదల చేయనున్నారు.
అన్నయ్య సినిమా రావాల్సిన నెలలో తమ్ముడి సినిమా విడుదల చెయ్యటానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి కొంతమంది సినీ నిర్మాతలు కలసి పవన్ కళ్యాణ్ సినిమా ను వాయిదా వేయించారు.

జనవరి 7న, ఆర్ ఆర్ ఆర్, జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్, జనవరి 15 న నాగార్జున బంగార్రాజు విడుదల కానున్నాయి.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

      భీమ్లా నాయక్ సినిమా లేటెస్ట్  వర్కింగ్ స్టీల్..                        

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగులో తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. భీమ్లా నాయక్‌ సినిమా నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఇప్పటికే పవన్ టీజర్ కు సంబంధించి సోషల్ మీడియా లో పవన్ అభిమానుల నుంచి భారీ లెవెల్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. పవన్ కళ్యాణ్ టీజర్ తో పాటు రానా టీజర్ కూడా రిలీజ్ చేసి , అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలను పెంచేలా చేసింది చిత్ర యూనిట్ .. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది ……ఈ సినిమా కు సంబంధించి ఓక పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది , ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు కలిసి విశ్రాంతి తీసుకున్నటు ఈ పిక్ లో కనబడుతుంది .. పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ సాధారణ బ్లూ షర్ట్ లో కనబడుతుంటే , రానా వైట్ అండ్ వైట్ షర్ట్ పంచ కట్టు తో ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .. ఈ పిక్ చూసి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు ..