మరోక్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టిన నాగ చైతన్య …

నాగ చైతన్య న్యూ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ….

అక్కినేని నాగ చైతన్య – శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సినిమా లవ్ స్టోరీ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది … రొటీన్ కి బిన్నంగా సినిమాలు తీసే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల ఒకరు . ప్రేమ కధలను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసే విధానం వేరు .. శేఖర్ కమ్ముల నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుండి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు .. లవ్ స్టోరీ సినిమా తరువాత నాగ చైతన్య ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు , వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు .. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి సారి చైతూ బాలీవుడ్ లో నటించిన ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. .లాల్ సింగ్ చద్దా సినిమా తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు .. బాలీవుడ్ సినిమా తరువాత చై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ’ సినిమా లైన్ లో ఉంది .. గ్యాంగ్ లీడర్ సినిమా తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని నాగచైతన్య తో థ్యాంక్యూ సినిమా ను తెరెకెక్కిస్తున్నారు , ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు .. థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు వచ్చినట్లుగా సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి ..అక్కినేని నాగ చైతన్య థ్యాంక్యూ సినిమా తరువాత నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా చైతూ చేసేందుకు సిద్దం అయ్యాడు. తండ్రి తో కలిసి ఇప్పటికే మనం సినిమాలో నటించిన చైతూ ఈసారి బంగార్రాజు సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు. అక్కినేని నాగ చైతన్య , మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ..ఇక అసలు విషయానికి వెళ్ళితే లవ్ స్టోరీ సినిమా తరువాత నాగ చైతన్య వరుస పెట్టి సినిమాలు లైన్ లో పీఠిన మాట వాస్తవమే ,కానీ ప్రస్తుతము నాగ చైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో సినిమా పూర్తి కాగానే ఆ తరువాత , థ్యాంక్యూ సినిమా , ఆ తరువాత బంగార్రాజు సినిమా లైన్ లో ఉన్నాయి .. ప్రస్తుతము డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమా పూర్తి అయితే నే మరో సినిమా ఎనౌన్సమెంట్ చేస్తారు .నాగ చైతన్య డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అనేది తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు కొద్దీ రోజులు ఆగాలిసిందే …….