అలరించిన రాగా, రస ఔర్ ఫుర్సత్, హిందుస్థానీ క్లాసికల్ ఖచేరీ..

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,జనవరి 28,2023: రాగా, రస ఔర్ ఫుర్సత్, ముంబైకి చెందిన ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు నిరాలీ కార్తిక్, సితార్ వర్ధమాన తార, ఢిల్లీకి చెందిన మెహతాబ్ అలీ నియాజీ పాల్గొన్న హిందుస్థానీ క్లాసికల్ కచేరీ శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని సప్తపర్ణిలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీపీ సూర్మండల్ లక్ష్మీదేవి వ్యవస్థాపకుడు మోహన్ హెమ్మాడి లాంఛనంగా ప్రారంభించారు.

రాగా, రస ఔర్ ఫుర్సత్ అనేది ఒక బహుళ-నగర ఖచేరీ పర్యటన. ఇది ముంబై ఆధారిత సంస్థ త్వమ్ ఆర్ట్స్ ప్రయత్నం, దీనికి తాజ్ మహల్ టీ, హైదరాబాద్ ఆధారిత సుర్మండల్ యూనివర్సల్ రియల్టర్స్ మద్దతు ఇస్తున్నాయి. ఈ ఖచేరీ పర్యటన హైదరాబాద్ నగరం నుంచి ప్రారంభమైంది.

మల్టీ సిటీ టూర్‌ను ప్రారంభించడానికి హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నానంటే..? హైదరాబాదీలకు తాజ్ మహల్ టీ అంటే చాలా ఇష్టం. అందుకే నా సొంత నగరం ముంబై కంటే హైదరాబాద్‌ను ఎంచుకున్నామని గాయకురాలు నిరాలీ కార్తీక్ అన్నారు.

ఆమె రాగ మధువంతి, మెహమాన్ సేతో తన కళా ప్రదర్శనను ప్రారంభించింది. ఈ భూమి మీద మనమందరం అతిథులము. అందుకోసం మనుధర్మ ఒకరిపై ఒకరికి ప్రేమతో జీవించాలి అని ఆమె పాడిన శాస్త్రీయ సంగీతం అందర్నీ అలరించింది. రాగ, రస ఔర్ ఫుర్సత్ ఇద్దరు అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు నిరాలీ కార్తిక్ ,మెహతాబ్ అలీ నియాజీతో పాటు సంగీత విద్వాంసులతో పాటు ప్రదర్శించారు.

నీరాలి కార్తీక్‌తో పాటు అమిత్ మిశ్రా, ఓంకార్ అగ్నిహోత్రి, ఖుర్రామ్ వంటి కళాకారులు ఉన్నారు. మల్లెపూలు, సాంప్రదాయిక సీటింగ్ ఏర్పాట్లు, కొవ్వొత్తి-వెలుగులు, అలంకరణలు గతంలోని రాయల్టీ శాస్త్రీయ సంగీతాన్ని ఎలా ఆస్వాదించాయో గుర్తుచేస్తుంది. ఢిల్లీలో డిజైనర్ అయిన ధ్రువ్ సింగ్ ఈవెంట్ డెకరేషన్ కు నాయకత్వం వహించారు.

ప్రధాన ప్రదర్శన కళాకారిణి నిరాలి కార్తీక్ ముంబైకి చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు. ఆమె మేవాటీ ఘరానా మాస్ట్రో పండిట్ సంజీవ్ అభ్యంకర్ శిష్యురాలు. ఆమె అహ్మదాబాద్‌లోని సప్తక్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో శ్రీ వికాస్ పారిఖ్ నుంచి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది.

గుజరాత్ సంగీత నాటక కళా అకాడమీ నుంచి శ్రేష్ఠ సాధక్ అవార్డు గ్రహీత, నిరాలీ కార్తీక్ IIC ఢిల్లీ, IMG జాన్ ఫెస్ట్, ఖుస్రూ కబీర్ ఫెస్టివల్, కళా ప్రకాష్ – వారణాసి, JLF మరెన్నో కచేరీలు వంటి భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శన ఇచ్చారు. ఆమె కచేరీలు హాలండ్, టాగోర్ సెంటర్ బెర్లిన్, వ్రిజే గెలుడెన్ వంటి అంతర్జాతీయ వేదికలలో కూడా ప్రదర్శన ఇచ్చింది.

Leave a Reply