ప్రభాస్ తో మారుతీ మూవీ ….గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు
ప్రభాస్ కి స్టోరీ వినిపించిన మారుతి
టాలీవుడ్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి సినిమాలకు యూత్ లో బాగా క్రేజ్ ఉంటుంది .. యూత్ పల్స్ , కామిడీ టైమింగ్ , కాన్సెప్ట్ సినిమాలు తీయాలన్న మారుతి రూటే వేరు , పాన్ ఇండియా సినిమాలు మధ్య చిన్న సినిమాలు వస్తున్న తరుణంలో పక్కాగా డైరెక్టర్ మారుతి సినిమా ఒకటి ఉంటుంది ..ప్రస్తుతం డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి ఒకరు . చిన్న సినిమాలతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు ..మారుతి సినిమాలు అంటేనే మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి అని నిర్మాతలు చెబుతుంటారు , రొటీన్ కి బిన్నంగా మారుతి స్టోరీస్ ఉంటాయి , మారుతి డైరెక్షన్ లో ఏ హీరో నటించిన వారికి బెస్ట్ సినిమా అవుతుంది ..
మారుతి – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ప్రతిరోజూ పండగే . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్ ” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్సుమెంట్ చేస్తున్నారు ..ప్రస్తుతము డైరెక్టర్ మారుతి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి , వాటిలో . గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ , మరియు సంతోష్ శోభన్ నటించిన ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా , సంతోష్ శోభన్ నటించిన మంచిరోజులు వచ్చాయి’ సినిమా దీపావళి పండుగన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది .. ఈ సినిమా తరువాత మాస్ హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్” సినిమాను తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , రిలీజ్ చేసి , గోపీచంద్ అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. ప్రస్తుతము చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమా తరువాత , మెగా స్టార్ చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి , తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .
డైరెక్టర్ మారుతి కెరీర్ మొదటి నుంచి మీడియం రేంజ్ హీరోలోతో సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు . మారుతి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ తో మాత్రమే ‘బాబు బంగారం” అనే సినిమా చేసారు.. ప్రస్తుతము డైరెక్టర్ మారుతి సీనియర్ హీరోల కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది .. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక స్టోరీ సిద్ధంచేయగా , తాజాగా మరో బాంబ్ లాంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి కూడా మారుతి ఒక లైన్ వినిపించాడనీ .. అది ఆయనకి బాగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనుకోవలసిందే. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి , చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి , అలానే ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి , అలానే డైరెక్టర్ మారుతి చేస్తున్న పక్కా కమ్మర్షియల్ సినిమా పూర్తి అయితే కానీ మరోక సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మొత్తానికి డైరెక్టర్ మారుతి ఒక్క పెద్ద స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం బాగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి సోషల్ మీడియా లో మారుతి – ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అన్న విషయం వైరల్ అవుతుంది .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే డైరెక్టర్ మారుతి ,పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్లే .మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళనుందో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే …