పవర్ స్టార్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్న హరీష్ శంకర్ …

పవన్ కళ్యాణ్ లోని మరో యాంగిల్ చూపిస్తాను అంటున్న హరీష్ శంకర్ …

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. పవన్ కళ్యాణ్ చేతిలో హరి హర వీర మల్లు , మరియు భీమ్లా నాయక్ సినిమాలు ఉన్నాయి , వీటిలో ముందుగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానుంది , భీమ్లా నాయక్ సినిమా తరువాత , హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది , పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ ది హిట్ కాంబినేషన్ , గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” గబ్బర్ సింగ్ ” ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు .. డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాకా మల్లి ఆ రేంజ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ కు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్లి సెకండ్ ఛాన్స్ రావడం , ఈ సారి గబ్బర్ సింగ్ కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీయాలి అని ఎంతో కసి మీద ఉన్నట్లు తెలుస్తుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రెండొవ సారి రిపీట్ అవుతుంది కాబట్టి , గబ్బర్ సింగ్ కంటే మించిపోయే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇవ్వడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ , సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు అని తెలుస్తుంది .. ఈ సినిమా టైటిల్ , “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది , ఈ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ మరియు యంగ్ లుక్‌లో కనిపించడం చూసి పవన్ అభిమానులు బాగా సంతోష పడుతున్నారు ..ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఈ సినిమా సబ్జెక్ట్ హై ఓల్టేజి పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. అంతే కాదు , ఈ సినిమా పాలిటిక్స్ మీద కొన్ని అంశాలు డైరెక్టర్ హరీష్ శంకర్ టచ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. గతంలో పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో కూడా కొన్ని పొలిటికల్ పాయింట్స్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ చూపించారు .. 2012 లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తరువాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్” సినిమా లో కూడా కొన్ని ఢిల్లీ పోల్టిక్స్ మీద కొన్ని అంశాలు కచ్చితంగా ఉంటాయని డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు చిన్న హింట్ ఇచ్చేసారు .. మొత్తానికి డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ తో సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమా తో ప్రేస్క్షకుల ముందుకు వస్తున్నట్లు సినిమా పోస్టర్ చూస్తే అర్ధము అవుతుంది .. మొత్తానికి డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబో లో వస్తున్న సినిమా లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది అని సోషల్ మీడియా లో వచ్చే వార్తల్లో నిజం ఎంత వరకు ఉన్నదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే ..