విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. పులమాలలు వేసి, పుష్పగుఛ్చాలతో ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తప్పెటగుళ్లు, కోలాటం, తీన్ మార్ కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది యువకులు కార్లు, బైకులతో వెంటరాగా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మాధవధారలోని పార్టీ కార్యాలయానికి శ్రీ మనోహర్ గారు చేరుకున్నారు. మాధవధార పార్టీ కార్యాలయానికి వచ్చిన శ్రీ మనోహర్ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వితోపాటు పలువురు మహిళ నేతలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర నాయకులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీమతి పి.ఉషా కిరణ్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు, శ్రీ శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, పార్టీ నాయకులు శ్రీ గెడ్డం బుజ్జి, శ్రీ గిరడా అప్పల స్వామి, శ్రీ సూర్యచంద్ర తదితరులతో సమావేశమయ్యారు.

“గూడుపుఠాణి” ప్రి రిలీజ్ ఈవెంట్

సప్తగిరి “గూడుపుఠాణి” ట్రైలర్ ఆసక్తికంగా ఉంది : మారుతి !!!

“గూడుపుఠాణి” ప్రి రిలీజ్ ఈవెంట్

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం “గూడుపుఠాణి ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రే రేలీజ్ ఈవెంట్ కార్యక్రమం సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరూపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన సినీమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , దర్శకుడు మారుతి,స్పీకర్ రాంభూపాల్ , ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్, అలీ, ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ .. ఈ మధ్య  నేను సినిమా ఫంక్షన్ లకు అటెండ్ కాలేదు కానీ తమ్ముడు సప్తగిరి ఫిలిచిన వెంటనే నేను ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. ఎందుకంటే తెలుగు చిత్ర రంగంలో చాలా మంది సినీ వారసులుగా ఇండస్ట్రీలో కి ఎంటర్ అయ్యారు.. కానీ ఒక మాములు వ్యక్తి ఏ బ్యా గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం.చలన చిత్ర పరిశ్రమకు యంగ్ జనరేషన్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. హీరోగా నాలుగవ చిత్రంలో నటించిన సప్తగిరికి దేవుడు ఆశీర్వాదం తో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్  గార్లు సినిమాను చాలా చక్కగా నిర్మించారు,దర్శకుడు కుమార్ గారు మంచి కథను తెరకెక్కించారు.ఇంతకాలం సింగర్ గా  ఉన్న రఘుకుంచె గారు ఈ  చిత్రంలో విలన్ గా నటించడం విశేషం.  ఎంతో కష్టపడి చేసిన వీరందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ… సప్తగిరి చేస్తున్న గూడుపుటాని ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ కటారి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సప్తగిరి ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తాడు తాను భవిషత్తులో చేసే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను, డైరెక్టర్ కుమార్ “గూడుపుఠాణి” సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతాప్ విద్య సంగీతం బాగుంది. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ …. మా ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసే మేము సినిమా రంగం వైపు రావడం జరిగింది. దర్శకుడు కుమార్  చెప్పిన  కథ నచ్చినపుడే మా బ్యానర్లో ఈ సినిమాకు సప్తగిరి తో  తీయాలని అనుకున్నాము. ఇందులో సప్తగిరి అద్భుతంగా నటించాడు. ఇంతకుముందు వచ్చిన సాగర సంగమం వసంతకోకిల,ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి స్వయంకృషి, అలీగారి మయాలోడు చిత్రాలలో వారంతా నటించి ఎలా మెప్పించారో వారి లాగే  అద్భుతమైన నటనతో ఈ సినిమాలో సప్తగిరి తన నటనతో విశ్వరూపం చూపించాడు. ఇంతమంచి సినిమాకు సంగీత దర్శకుడు తన పాటలతో ప్రాణం పోశాడు. పెద్ద పెద్ద సంగీత దర్శకులకు తీసిపోకుండా ఇందులో చాలా మంచి సంగీతం అందించాడు. సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగుంటుంది. ఇందులో నటించిన వారందరూ కూడా ఎవరికి వారే వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. నటీనటులను ఇంత బాగా చేస్తారా అనే విధంగా ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.చిత్ర దర్శకుడు కొత్తవాడైనా కూడా తను ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో సినిమా తీశాము. దర్శకుడు తన ప్రతిభతో ఈ సినిమాను మరో  లెవెల్ కు  తీసుకెళ్ళాడు. ఇందులో ప్రేక్షకులకు కావలసిన సాంగ్స్, స్టోరీ, ఫైట్స్ అన్ని సమపాళ్లలో ఉన్నాయి సప్తగిరి గారి కష్టం నేను చూశాను ఆయన కష్టానికి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టయ్యి ఆయన కెరీర్ లో ఈ సినిమా  ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ లో మేము తీసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి,ఆశీర్వదించి సినిమాను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ… సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి  టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ చెప్పిన లైన్ నచ్చి చాలా థ్రిల్ ఫీలయ్యి ఈ సినిమాచేస్తున్నాను. నేను చిన్న హీరోను అయినా కూడా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలు వారికి నా ధన్యవాదాలు… సప్తగిరి ఎక్స్ ప్రెస్స్ లో సెంటిమెంట్ , ఎమోషన్ చేసిన నేను ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమా చేయలేదు. దర్శకుడు షాట్ బై షాట్ చెప్పి నాతో చాలా ఈజీ గా యాక్ట్ చేయించాడు. నాకు చెప్పిన కథలో దర్శకుడు కొన్ని మార్పులు చేసి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా ట్రైలర్ చూసిన వారందరూ కూడా  క్లాసీగా చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.ఇదంతా డిఓపి పవన్ చెన్న కె దక్కుతుంది. నన్ను సినిమాలో చాల చక్కగా చూపించారు.సంగీత దర్శకుడు ప్రతాప్ విద్య మంచి పాటలు అందించారు. ఫస్ట్ లాక్ డౌన్ లో ఓ సినిమా తీయడానికి భయపడే రోజుల్లో అవుట్ డోర్ లో సినిమా తీసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప నిర్మాతలు  పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ గార్లు. చిత్ర నిర్మాతలు ఎంతో దైర్యంగా మా అందరికీ సపోర్ట్ గా వుంటూ మైసూరులోని శ్రీకృష్ణ దేవాలయం, చిక్ మంగళూరు,హంపి, మేల్కొటి, కంచి, ఆ ప్రాంతాలలో షూటింగ్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ ఆర్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే పదిమంది మాట్లాడుకునే విధంగా ఉండాలని ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ పుట్ తో సినిమాను నిర్మించారు నిర్మాతలు.ముఖ్యంగా మా అన్నయ్య దర్శకుడు మారుతి గారు పిలిచిన వెంటనే నీకు నేనున్నాను అంటూ వచ్చి నన్ను బ్లెస్స్ చేశాడు. ఆయన ద్వారానే నేను ఇండస్ట్రీని చూడడం జరిగింది. అన్నయ్య తీసిన “ప్రేమ కథా చిత్రం” ద్వారా స్టార్ కమెడియన్ అయ్యాను. ఆ చిత్రంతో నా లైఫ్ మార్చిన గొప్ప మహానుభావుడు తను. నేను రోజు ఇంతటి వాడినవ్వడానికి కారణం తనే. అన్నయ్యా..మీరు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నా ధన్యవాదాలు .ఈ మధ్య నాకు  మరొక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. మీరు చూపించిన మార్గంలో నడిచి మీకు మంచి పేరు తీసుకువస్తాను. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారంటే  నాకు చాలా సెంటిమెంటు సప్తగిరి ఎక్స్ ప్రెస్, నుండి ప్రతి సినిమా కు వచ్చి నన్ను బ్లెస్స్ చేస్తాడు. ఈ సినిమాలో రఘు కుంచే గారు విలన్ గా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. తెలుగు సినిమాకు మంచి విలన్ దొరికాడు . స్పీకర్ రాంభూపాల్ రెడ్డి ఆదోని ఎమ్ ఎల్.ఏ, ఆలీ గారు ఇలా అందరూ వచ్చి నన్ను నా సినిమాను బ్లెస్స్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

దర్శకుడు కుమార్ కె.ఎం మాట్లాడుతూ… నేను దస్తగిరి గారికి నేను చెప్పిన లైను నచ్చడంతో  ఈ కథకు ఓ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తాననడం చాలా గొప్ప విషయం.సినిమాకు తను చాలా బాగా సపోర్ట్ చేశాడు. నా కథకు మంచి ప్రొడ్యూసర్స్, హీరో దొరకడం నా అదృష్టం . సినిమా షూటింగ్ అయిపోయింది సెన్సార్ అయినప్పుడు సెన్సార్ వాళ్ళు పిలిచి సినిమా చాలా బాగుంది బాగా తీసావ్ అని చెప్పడం నా హ్యాపీ ఫీలయ్యాను. ఈవెంట్ కి  మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,మారుతి గారు,అలీ గారు ఇలా అనేక మంది వచ్చి సినిమా బాగా తీశావ్ అంటుంటే నాకు ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ప్రొడ్యూసర్స్ కు నా కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది విద్యా గారి  మ్యూజిక్, పవన్ గారి కెమెరా పనితనం ఇలా ఈ సినిమాకు పనిచేసిన వారందరూ ఎంతో సపోర్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ సీన్ మొదలుకొని లాస్ట్ సీన్ వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా.. విపరీతమైన ఇంట్రెస్ట్ తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా అలరిస్తుంది అన్నారు.

సంగీత దర్శకుడు ప్రతాప్ విద్య మాట్లాడుతూ.. హరీష్ శంకర్ గారు రిలీజ్ చేసిన సాంగ్ కు ప్రేక్షకులందరూ మంచి బ్లెస్సింగ్స్ అందించారు.ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. సప్తగిరి లాంటి మంచి ఆర్టిస్టు తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ గూడుపుఠాని చిత్రంలో సంగీత దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ రాంభూపాల్ ,
ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్,అలీ,  ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్ తదితరులందరూ చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇస్తూ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు..

సాంకేతిక నిపుణులు:
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్

నవీన్ పోలిశెట్టి హీరోగా

నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం

ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు “ఫార్చ్యూన్ 4 సినిమాస్”. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ “ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.

‘నవీన్ పోలిశెట్టి’
ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా.
ఆయన కథానాయకుడు గా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు అధికారికంగా
ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటూ ప్రకటించారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. కథానాయకుడు గా ఆయనకిది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.

లవ్ స్టోరీ

“లవ్ స్టోరీ ” సినిమా పై వస్తున్న రూమర్స్

2019 లో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య , శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మజిలీ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సొంతం చేసుకుంది . మజిలీ సినిమా కంటే నాగ చైతన్య చేసిన శైలాజా రెడ్డి అల్లుడు , మరియు సవ్యసాచి సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేకపోయాయి .. సవ్యసాచి సినిమా టేకింగ్ , ట్రైలర్స్ ,టీజర్స్ , తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. మజిలీ సినిమా తో హిట్ అందుకున్న నాగ చైతన్య కొంత గ్యాప్ తీసుకొని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో “లవ్ స్టోరీ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఫిదా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సారి నాగ చైతన్య తో సినిమా ఎనౌన్స్ చేయగానే చై ఫాన్స్ లో సినిమా మీద అంచనాలు విపిరీతంగా పెరిగిపోయాయి .. శేఖర్ కమ్ముల సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది , వాస్తవానికి శేఖర్ కమ్ముల సినిమాలు త్వరగా అర్ధం కావు , మెల్లిగా మెల్లిగా అర్ధం అవుతాయి , ఈ క్రమంలో లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగానే ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది … ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్ . శేఖర్ కమ్ముల మార్క్ సెన్సిబుల్ లవ్ స్టోరీ – ఎమోషన్స్ తో కూడిన ఈ ఫ్రెష్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఎన్నాళ్ళుగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే విడుదలైన కొన్ని గంటల్లోనే 5.2 మిలియన్ కు పైగా వ్యూస్.. 340K లైక్స్ తో యూట్యూబ్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. అదే సమయంలో ఇందులోని ఓ డైలాగ్ పొలిటికల్ నేపథ్యంలో కాంట్రవర్సీ అవుతోందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. ఇక వివరాల్లోకి వెళితే.. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ లో నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన ”రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షా నే తొక్కుతాడు.. గొర్రెలోనికి గొర్రెలు ఇస్తే వాడు గొర్రెలే మేపుతాడు.. ఇంకేమి డెవలప్ అవుతాం సార్” అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ తెలంగాణ ప్రభుత్వం మీద సెటైర్ వేస్తున్నట్లు ఉందని సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి .. సోషల్ మీడియా లో వస్తున్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాలి అంటే కొంత కాలం ఆగాలిసిందే ……

“హనీ ట్రాప్”

ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హనీ ట్రాప్” ను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నాం – దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించి… 18 స్టేట్ అవార్డ్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలందుకొన్న ఏకైక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ‘హనీ ట్రాప్’ అనే చిత్రంతో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో… భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామనరావు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ… “గతంలో నా దర్సకత్వంలో తెరకెక్కిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలు మంచి విజయాలు అందించాయి. ఇప్పుడు తెరకెక్కించిన ‘హనీ ట్రాప్’ కూడా అలాంటి కోవకు చెందిన ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ చిత్ర కథ మా నిర్మాత వి.వి. వామన్న రావు గారిదే. నేను మాటలు, దర్శకత్వం వహించాను. హనీ ట్రాప్ అనేది ఒక అంతర్జాతీయ అంశం. ఈ కాన్సెప్ట్ మీద 3, 4 చిత్రాలు చేసే మెటీరియల్ ఉంది. ప్రతిరోజూ మనం పత్రికల్లో ఈ హనీ ట్రాప్ కథలు చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్ లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా చిక్కుకుని ఉన్నారు. ఈ ట్రాప్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా సులభంగా మోసం చేసేయవచ్చు. అలాంటి అంశాలను కూడా ఇంటెరెస్టింగ్ గా యూత్ ని ఆకర్షిస్తూ సినిమాను తీసాము.

ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే. రుషి, మిస్ వైజాగ్ శిల్ప మరియు తేజు అనే యంగ్ టాలెంట్ ని పరిచేయం చేస్తున్నాము. మా నిర్మాత కూడా మంచి పాత్ర చేసారు. లజ్జ సినిమా హీరో శివ దందా మంచి పొలిటికల్ క్యారెక్టర్ చేసాడు.
నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫలితం పక్కన పెడితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఒక కథకి సినిమా రూపం లో ప్రాణం పోస్తాము. ఈ ప్రక్రియ నాకు కిక్ ఇస్తుంది. అందుకే సినిమా అంటే ప్యాసన్.

నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్ ఉంటుంది. నాకు అవార్డ్స్ వచ్చిన సొంత ఊరు, గంగ పుత్రుల్లో కూడా రొమాన్స్ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు. మన హిందూ కల్చర్ లో కూడా శృంగారం ఉంది. కానీ ఇప్పటి పాశ్చాత్య సంస్కృతి వల్ల మనం అని దాచేసుకుంటున్నాం, సిగ్గుపడుతున్నాం. మనం ఓపెన్ గా డిస్కస్ చేయటం లేదు. వీటిని బ్రేక్ చేయటానికి నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, హనీ ట్రాప్ లాంటి సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమా దర్శకుడుని మీరు ఇలాంటి చిత్రాలు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే… ఒక 9 ఏళ్ళ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఆ అమ్మాయి సొసైటీ ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని ఎలా చెప్తుంది? ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాల విడుదల చాలా మంది బాధితులు పోలీసులును ఆశ్రయించారు. దాంతో నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అభినందించింది.

హనీ ట్రాప్ అనేది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ తో చిత్రీకరించాము. ఈ నెల సెప్టెంబర్ 17న విడుదల అవుతుంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

ఈ చిత్రం తరువాత ఇంకా మూడు సినిమాలు నా దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఇందులో మొదటిది “వెల్కమ్ తో తీహార్ కాలేజీ”. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పే సినిమా. విడుదల కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. చదలవాడ శ్రీనివాస్ గారు ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇది తండ్రి కొడుకుల కథ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇంకో సినిమాకి బాపిరాజు గారు నిర్మాత. త్వరలో ఈ రెండు సినిమాల గురించి అన్ని వివరాలు చెబుతా” అంటూ ముగించారు.

బల్లాల దేవ టీజర్ కు డేట్ ఫిక్స్

భీమ్లా… భీమ్లా నాయక్‌’ అని ఒకరు. ‘డేని… డేనియల్‌ శంకర్‌’ అంటూ మరొకరు. ఇద్దరూ శక్తిమంతమైన వ్యక్తులే. మరి వీరిద్దరి మధ్య గొడవేమిటో… అది ఎక్కడివరకు దారి తీసిందో తెలియాలంటే మాత్రం ‘భీమ్లా నాయక్‌’ విడుదల వరకు ఆగాల్సిందే. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమా పేరుని అధికారికంగా ప్రకటించడంతోపాటు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది .. ఇప్పటికే రిలీజైన పవన్ టీజర్ ఇంట్రో సాంగ్ కు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .. పవన్ అభిమానులు పవన్ గ్లిమ్స్ ఫై ఫుల్ హ్యాపీ గా ఉన్నారు .. పవన్ కళ్యాణ్ కు సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు కానీ , రానా కు సంబంధించి ,ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ,రానా ఫాన్స్ రానా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు . రానా క్యారెక్టర్ గురించి సోషల్ మీడియా లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి .. అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ పై చిత్రబృందం క్లారిటీనిచ్చింది
రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అంటూ రానా అభిమానులకు క్లారిటీనిచ్చారు. .రానా పాత్రకు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్షణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ పవన్ టీజర్ తరహాలోనే పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కంటెంట్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో రానా పాత్రను తక్కువ చేశారా ఎక్కువ చేశారా? అన్నది తెలియాలంటే టీజర్ వరకూ ఆగాల్సిందే.

హీరోగా “గణేష్ బెల్లంకొండ”

*హీరోగా “గణేష్ బెల్లంకొండ” పరిచయ చిత్రం ”స్వాతిముత్యం”
*ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం.

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్’ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.
‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

సెప్టెంబర్ 15న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

1 260 261 262