“వెల్లువ” టైటిల్ పోస్టర్

అలీ గారి చేతులమీదుగా విడుదలైన “వెల్లువ” టైటిల్ పోస్టర్

వీనస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్(కేరళ), అలీ, రావు రమేష్, పెద్ద నరేష్, నటీనటులు గా మైల రామకృష్ణ దర్శకత్వంలో M. కుమార్ , M. శ్రీని వాసులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “వెల్లువ”. ఈ చిత్రం  షూటింగ్ హైదరాబాద్ లోని సైనిక్ పురి లోగల హైజాక్ బిస్ట్రో లో  అలీ పై ‘చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ  ‘ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో అలీ గారు ‘వెల్లువ’ చిత్ర టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.అనంతరం

నటుడు అలీ మాట్లాడుతూ* ..చిత్ర నిర్మాత కుమార్ గారు మనీషా ఫిల్మ్స్ లో 20 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు, ఇప్పుడు ఈ చిత్రాన్నీ
శ్రీనివాస్ గారితో కలిసి నిర్మిస్తున్నాడు. హీరో రంజిత్ కి ఇది మూడవ సినిమా. రంజిత్ తో గతంలో జువ్వ  మూవీ చేసాను. ఇది తనతో రెండవ సినిమా .ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. అసిస్టెంట్ గా, కో డైరెక్టర్ గా,.అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా  పరిచయ మవుతున్నాడు. ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ అద్భుతమైన పాటలు అందించాడు.ఇందులో నాతో  “చెప్పకురా మామా ..నువ్వు చెప్పకు సారీ ..పాటను పాడించారు. ఇందులో హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు ఇది బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న కథ . అక్టోబర్ లో  విడుదల అవుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ కు పెద్ద విజయం  సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ … నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్ తో వస్తున్న చిత్రమిది. నిర్మాతలు నాకేం కావాలో అన్ని సమకూర్చారు. కొవిడ్ కారణంగా లేట్ అయినా  సినిమా చాలా బాగా వచ్చింది. ఘంటాడి కృష్ణ గారి సంగీతం,బాల్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. రావు రమేష్ గారు, అలీ, సీనియర్ నరేష్, లాంటి పెద్ద నటులతో  సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.హీరో రంజిత్, అలీ గార్లతో  చేసే ఈ పాటతో తో సినిమా పూర్తయింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ .. సీనియర్ నటులతో నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఘంటాడి కృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలీ గారితో కలసి పాట చేసుకున్నందుకు చాలా అందంగా ఉంది .ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది.విద్యార్థి చివరి దశలో మనం జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే జీవితాంతం అందరమూ కూడా సంతోషంగా ఉంటాం.జీవనోపాధి తర్వాతే లవ్, పెళ్లి అనే మంచి కాన్సెప్టు తో వస్తున్న  సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందిస్తున్నాము.ఇందులో నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు .మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాను అన్నారు.

మరో నిర్మాత కుమార్ మాట్లాడుతూ ..ఈ సినిమా అలీ, రావు రమేష్ , సీనియర్ నరేష్ గార్లకు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ఈ కథ నచ్చడంతో  ఈ సినిమాపై మాకు మరింత నమ్మకం ఏర్పడింది.. గతంలో నేను చాలా సినిమాలు చేశాను సీనియర్ నటులతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాం .సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సొసైటీకి ఇలాంటి మంచి  సినిమా కావాలి. ఘంటాడి కృష్ణ గారు అందించిన పాటలను ప్రేక్షకులు అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. టెక్నీషియన్స్ అందరూ కోవిడ్ పరంగా ఎంతో ఇబ్బంది పడిన కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు వారి వల్లే సినిమా బాగా వచ్చింది.  ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది..అన్నారు

సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ … వీనస్ పతాకంపై వస్తున్నా “వెల్లువ” సినిమాకు నేను నిజంగా వెల్లువ లాంటి సంగీతం అందించాను. ఇంత మంచిది సబ్జెక్టుకు ఇంత మంచి పాటలు నాతో దగ్గరుండి చేయించుకున్నారు దర్శక, నిర్మాతలు.నిర్మాతలకు సినిమాపై  టేస్ట్ ఉండడం వల్లే పాటలు  సిచువేషన్ తగ్గట్టు బాగా వచ్చాయి. ఈ సినిమా నేను అందించిన మ్యూజిక్ నా కెరీర్లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది అని భావిస్తున్నాను అన్నారు.

నటీనటులు
రంజిత్ , సౌమ్య మీనన్ (కేరళ ),విలన్ గగన్ విహారి (108 మూవీ ఫేమ్),రావు రమేష్, పెద్ద నరేష్, ఆలీ, సత్యం రాజేష్, తోటపల్లి మధు, ఆటో రామ్ ప్రసాద్, జూనియర్ రేలంగి, ఆనంత్, కెవ్వు కార్తిక్, సంధ్య జనక్, సుధ (కన్నడ),రియా, కల్పన, రాధిక

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు :- M. కుమార్ , M. శ్రీనివాసులు
డైరెక్షన్ :- మైల రామకృష్ణ
ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ :- బి.నాగేశ్వర్ రావు
మ్యూజిక్ :-ఘంటాడి కృష్ణ
డి.ఓ.పి :- బాల్ రెడ్డి
ఎడిటర్ :- ప్రవీన్ పూడి
రైటర్ :-పరుచూరి నరేష్
డాన్స్ మాస్టర్ :- అజయ్ ,వెంకటేష్ దీప్
ఫైట్ మాస్టర్ :- శంకర్
ఆర్ట్ డైరెక్టర్ :- నారాయణ
స్టిల్స్ :- కృష్ణ కనుగుల
కాస్టూన్స్ :- సుబ్బయ్య ముర్ తోటి
లిరిక్స్ :-  రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీ మణి, ఉమా మహేష్, పండు తన్నేరు
పి.ఆర్.ఓ.:- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, నివాస్

‘పుష్ప: ది రైజ్’ రష్మిక ఫస్ట్ లుక్

‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన..

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తున్నారు రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

“లవ్ స్టోరి” సక్సెస్

“లవ్ స్టోరి” సక్సెస్ మాటలకు అందని సంతోషాన్నిచ్చింది – సినిమా టీమ్ మెంబర్స్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ పాత్రికేయులతో పంచుకుంది. ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా లవ్ స్టోరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…ఎన్నో కష్టాలు పడి లవ్ స్టోరి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. లవ్ స్టోరి సినిమా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ విజయం గురించి వింటుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. ఈ కార్యక్రమంలో ఇంటిలో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. అక్కడి నుంచి ఈ సినిమా కథకు ఇన్సిపిరేషన్ దొరికింది. లవ్ స్టోరి కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటి కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో లీనమై సహజంగా నటించారు. మా యూనిట్ లోని ప్రతి ఒక్కరికి లవ్ స్టోరి సక్సెస్ పట్ల థాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ…ఇప్పుడున్న టైమ్ లో థియేటర్లకు ఆడియెన్స్ ఎంతవరకు వస్తారు అని రిలీజ్ ముందు భయపడ్డాం కానీ ఇవాళ థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. లవ్ స్టోరి చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ అంశాన్నింటినీ సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు. లవ్ స్టోరి సినిమా థియేటర్ లలో చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లకు రండి మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరి చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ….మా సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ మా సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. లవ్ స్టోరి వినోదం కోసం చూసే సినిమా మాత్రమే కాదు…ఇందులో మన చుట్టూ సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు లవ్ స్టోరి చూశాక వస్తే మేము సంతోషిస్తాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి. అన్నారు.

నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ…లవ్ స్టోరి సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాదే. ఇంత గ్రాండ్ రిలీజ్ కు మాకు సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, సాయి పల్లవి..ఇలా ఈ టీమ్ తో మాకు మంచి బాండింగ్ ఉంది. అందుకే మా అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది. అన్నారు.

నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ…లవ్ స్టోరి సక్సెస్ గురించి ఇవాళ ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

” రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ 

” రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్  వింటుంటే..మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని “రిచి గాడి పెళ్లి” 9అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా”  పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కైలాష్ గారు ఇదివరకే బాహుబలి, భరత్ అనే నేను,, మున్నా,మిర్చి, పరుగు అరుంధతి,గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పాడారు. అలాగే ఈ చిత్రంలో  పాడిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు మెచ్చుకున్నారు, ఈ పాట గురించి

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ .. “రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు,  తన వాయిస్ ఈ పాటకి  చాలా బాగుంది. నాకు హేమ రాజ్  వైశాలి సినిమా నుంచి తెలుసు ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది, అందరూ మంచి ప్రయత్నం తో ఈ సినిమా చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేయాలి ఈ సాంగ్  వింటుంటే నన్ను లొకేషన్ కు తీసుకెల్లింది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు, సత్యన్‌ చాలా బాగా  కంపోజ్ చేశారు, ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు

లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ …రిచి గాడి పెళ్లి వంటి విచిత్రమైన చిత్రంలో  ఏమిటిది మతి లేదా.. ప్రాణమా అనే వేదాంతాన్ని బోధించే పాట.ఇది అంత పెద్ద  వేదాంతాన్ని బోధించినా కూడా అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మధురమైన బాణీలో ఈ పాట ఉంటుంది. కె యెస్ . హేమ రాజ్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక సృజనాత్మక కి బడ్జెట్ అనేది పరిధి కాదు, ఎంత తక్కువ బడ్జెట్లో అయినా ఏంతో అద్భుతమైన  కథనాన్ని చెప్పవచ్చు అని నిరూపించిన  చిత్రం ఇది. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను (ఇప్పట్లో ఇండోర్ గేమ్స్) ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల ఎన్ని జీవితాల్లో, ఎన్ని ప్రేమల్లో, ఎన్ని స్నేహాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం మీ అందరినీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను రాసిన పాట కూడా మిమ్మల్నందరినీ కచ్చితంగా అలరిస్తుంది అని అన్నారు. 

దర్శకుడు కె యెస్ .హేమరాజ్ మాట్లాడుతూ… “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు, వారికి మా కృతజ్ఞతలు .ఇంత మంచి పాట అందించిన అనంత శ్రీరామ్ కు ,సింగర్స్ కు ధన్యవాదాలు.మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి  హైలైట్ గా నిలుస్తుంది ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నటీనటులు
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య sk, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా తదితరులు

సాంకేతిక నిపుణులు
కె.యస్. ఫిల్మ్ వర్క్స్
సినిమా – “రిచి గాడి పెళ్లి”
నిర్మాత – కె.యస్. ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – కె.యస్. హేమరాజ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు – రామ్ మహంద్ర & శ్రీ
సహ నిర్మాత- సూర్య మెహర్
సినిమాటోగ్రఫీ – విజయ్ ఉలగనాథ్ సంగీతం – సత్యన్
ఎడిటర్ – అరుణ్ ఇ.యమ్
కథ – రాజేంద్ర వైట్ల & నాగరాజు సాహిత్యం – అనంత శ్రీరామ్ & శ్రీ మణి
డైలాగ్స్ – రాజేంద్ర వైట్ల
ఆర్ట్స్ – హరి వర్మ
కొరియోగ్రాఫర్ – సతీష్ శెట్టి
డిజైన్స్ – రెడ్డోట్ పవన్
కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బవరపు
మేకప్ – అంజలి సంఘ్వి
స్టిల్స్ – యమ్. యస్ ఆనంద్
డిజిటల్ – మనోజ్
పి.ఆర్.ఓ – మధు వి.ఆర్

“లవ్ స్టోరి” తో నటుడిగా నెక్ట్ లెవెల్ సంతృప్తి దొరికింది – హీరో నాగ చైతన్య

“లవ్ స్టోరి” తో నటుడిగా నెక్ట్ లెవెల్ సంతృప్తి దొరికింది – హీరో నాగ చైతన్య

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. “లవ్ స్టోరి” ఈ శుక్రవారం
థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. నాగ చైతన్య మాట్లాడుతూ…

  • దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఆసక్తి. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది. లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను.
  • లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు. జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము.
  • దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.
  • ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.
  • శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది. కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.
  • కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది. లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి. డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.
  • ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం. సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు.
  • మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం. దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.

ఏ.వి.డి సినిమాస్ ఘనంగా ప్రారంభం

విజయ్ దేవరకొండ -ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ‘‘ఏ.వి.డి సినిమాస్’’ ఘనంగా ప్రారంభం

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ కు ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే రౌడీవేర్,ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు ఏ.వి.డి సినిమాస్ పేరుతో తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో థియేటర్ ఓపెన్ చేశాడు..డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్,థియేటర్ రంగాలలో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యం లో విజయ్ దేవరకొండ కలిసి నిర్మించిన ఎవిడి సినిమా మల్టిప్లెక్స్ ఈ రోజు ప్రారంభం అయ్యింది.

మూడు థియేటర్స్ సముదాయం గా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ టాప్ క్లాస్ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించబోతుంది. డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి అధునాతన హంగు లతో అత్యుత్తమ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించ బోతుంది ఎవిడి సినిమాస్.
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ మాట్లాడుతూ :
మేము పుట్టి పెరిగిన చోట ఇలాంటి మల్టిప్లెక్స్ నిర్మాణం లో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. విజయ్ కి ఈ మల్టి ప్లెక్స్ చాలా స్పెషల్. ఏషియన్ సునీల్ గారి భాగస్వామ్యం మాకు చాలా ఆనందకరం గా ఉంది. టాప్ క్లాస్ ఎంటర్ టైన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది.అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు’’. అన్నారు..
ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ :
ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించాలనే మెహబూబ్ నగర్ లో ఏ.వి.డి సినిమాస్ ను నిర్మించాము. మాతో భాగస్వామ్యం అయిన హీరో విజయ దేవరకొండ కు కృతజ్ఞతలు. సినిమా అనుభవం సంపూర్ణంగా థియేటర్ లొనే కలుగుతుంది. మహబూబ్ నగర్ కే కాదు , చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఏ.వి.డి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది.
అన్నారు.
నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ ..
ఏషియన్ సినిమాస్- విజయదేవరకొండ భాగస్వామ్యం లో నిర్మించిన ఈ ఏ.వి.డి సినిమాస్ చాలా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియెన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. ఇప్పుడు వారికి అందుబాటులో ఒక టాప్ క్లాస్ మల్టిప్లెక్స్ ఉంది.ఓ డిస్ట్రిబ్యూటర్ గా ఇలాంటి థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషకరం..
ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ :
మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే మా ప్రయత్నం లో హీరో విజయ దేవర కొండ భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు. ఏ.వి.డి సినిమాస్ లో ప్రదర్శించే మొదటి సినిమా మా సంస్థ లో నిర్మించిన ‘‘లవ్ స్టోరి’’ అవడం చాలా ఆనందం గా ఉంది. మెట్రో సిటీస్ లో పొందే థియేటర్ ఎక్స్ పెరియన్స్ కి ధీటు గా ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించాము..ఇది తప్పకుండా మహబూబ్ నగర్ కి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది.’’ అన్నారు

‘రానా నాయుడు’లో మొదటిసారిగా రానా దగ్గుబాటి

వెంక‌టేష్‌ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో నెట్ ఫ్లిక్స్ భారీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు’

ఐకానిక్ రే డోనోవన్ కథ నుంచి తీసుకున్న ఈ ‘రానా నాయుడు’లో మొదటిసారిగా రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించబోతోన్నారు.

సెప్టెంబర్ 22, 2021 : బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఎప్పుడైనా అత్యవసర సాయం ఏర్పడితే ఎవరికి ఫోన్ చేస్తారో? అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? దానికి సమాధానం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉంది. అదే రానా నాయుడు. ఆయన ఎలాంటి సమస్యను అయినా సరే ఇట్టే పరిష్కరించగలరు.

దగ్గుబాటి హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తే అది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు పండుగే. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ పట్టేసింది. బాహుబలి భళ్లాల దేవ అకా రానా దగ్గుబాటి, అతని బాబాయ్ సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటిలతో ‘రానా నాయుడు’ అనే డ్రామా సిరీస్‌‌ను తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్. అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డోనోవన్’ షో టైం నుంచి కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

ఈ యాక్షన్ డ్రామాలో రానా నాయుడు జీవిత కథ ఉండబోతోంది. బాలీవుడ్‌లో ప్రముఖులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్‌ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. కరన్ అన్షుమాన్ షో రన్నర్ మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుపర్న్ వర్న కో డైరెక్టర్‌గా పని చేయనున్నారు.

ఈ సిరీస్ గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘ఇది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్. ఇటువంటివి మేం ఎప్పుడూ చేయలేదు. ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతోందని నాకు తెలుస్తోంది. ఇందులో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది సవాల్‌తో కూడుకున్నది అయినా కూడా ఎంతో సరదాగా ఉండోబోతోందనే నమ్మకం ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘రానాతో కలిసి పని చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇక మేం ఇద్దరం కలిసి త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తాం.. ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను రాయ్ డోనోవన్‌కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. వైస్ ప్రెసిడెంట్, రొక్సాన్నే పొంపా మాట్లాడుతూ.. ‘లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్, సుందర్ అరోన్, నెట్ ఫ్లిక్స్‌తో కలిసి రానా నాయుడు కోసం పని చేయడం, ఇండియన్ మార్కెట్‌లోకి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతృక నుంచి తీసుకున్న స్టోరీ లైన్, మన నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు చేర్పులు, ఆ పాత్రకు వారు సరిపయిన విధానం అన్ని కూడా బాగున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని అన్నారు.

సుందర్ ఆరోన్ (లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్) మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు కచ్చితంగా అద్భుతమైన ఫీలింగ్, థ్రిల్లింగ్‌ను ‘రానా నాయుడు’ ప్రాజెక్ట్ ఇస్తుంది. మాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. టాప్ క్వాలిటీ, షో రన్నర్, డైరక్టర్స్, ప్రొడక్షన్ టీం, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ కోసం, ‘రానా నాయుడు’ను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.

నెట్ ఫ్లిక్స్ ఇండియా, కంటెంట్, వీపీ , మోనిక షేర్గిల్ మాట్లాడుతూ.. ‘నెట్ ఫ్లిక్స్‌లో మొట్ట మొదటిసారిగా ఇద్దరు అద్భుతమైన స్టార్ హీరోలు రానా, వెంకటేష్‌లతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. మా మెంబర్స్‌ను ఆశ్చర్యపరిచే, ఆనందింపజేసే కథలను చెప్పాలని మేం ప్రయత్నిస్తుంటాం. రానా నాయుడు కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రానా, వెంకటేష్‌లకు మా సంస్థ తరుపున స్వాగతం పలుకుతున్నాం. ఆ ఇద్దరూ కలిసి చేసే మ్యాజిక్‌ను ప్రేక్షకులకు చూపించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.

క్రెడిట్స్
నటీనటులు : రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి
ప్రొడ్యూసర్ : లోకో మోటివ్ గ్లోబర్ ఇంక్.
షో రన్నర్ : కరన్ అన్షుమన్
డైరెక్టర్స్ : కరన్ అన్షుమన్, సుపర్న్ వర్మ
ఫార్మాట్ రైట్స్ : వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్

About Locomotive Global Inc.:
(లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్ గురించి)
లోకో మోటివ్ గ్లోబర్ ఇంక్ (LGI)ని 2013లో స్థాపించారు. సుందర్ అరోన్, స్కాట్ అండర్సన్ సంయుక్తంగా కలిసి ఈ సంస్థను నిర్మించారు. LGI అమెరికన్ ఇండియన్ కంపెనీ. ఇక్కడ వినోద రంగంలోని క్వాలిటీ, బెస్ట్ కంటెంట్, టీవీ ఇండస్ట్రీలో మంచి క్వాలిటీని ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. లోకో మోటివ్ గ్లోబల్ మీడియా ఎల్ఎల్‌పీ, లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్ కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాయి. ఇండియా మీడియా రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పని చేస్తున్నాయి. స్క్రిప్ట్ డ్రామా, ఫీచర్ ఫిల్మ్స్ ఇలా అన్ని అన్ని రకాల కథలను తెరకెక్కిస్తున్నాయి. టీవీ, ఓటీటీల్లో కూడా సేల్స్ ప్రోగ్రాం, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిల్లో LGI యాక్టివ్‌గా దూసుకుపోతోంది. స్టార్ టీవీ, హెబీవో, జీ టెలివిజన్ వంటి చానెల్స్‌లో LGI ఎన్నో రకాల ప్రాజెక్ట్‌లను చేపట్టింది. లేక్‌షోర్ ఎంటర్టైన్మెంట్స్, స్క్రీన్ మీడియా, ఎన్‌బీసీయూ, ఐటీవీ వంటి ఎన్నో సంస్థలతో LGI సత్సంబంధాలను కలిగి ఉంది. ఇక LGI 2019లో సీబీసీ స్టూడియో ఇంటర్నేషనల్/షో టైం డ్రామా సిరీస్ రే డోనోవన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ముంబై ఇండియా, లాస్ ఏంజిల్స్‌ కాలిఫోర్నియా లో LGI కార్యాలయాలు ఉన్నాయి.

About ViacomCBS Global Distribution Group:
(వయకామ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ గురించి)
వినోద ప్రపంచ మార్కెట్ మొత్తంలో ప్రీమియం కంటెంట్ వివిధ మీడియా ఫ్లాట్‌ఫాంలో అందించడంలోనే వయకామ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ ముందుంది. పారామౌంట్ పిక్చర్స్, పారామౌంట్ టెలివిజన్ స్టూడియోస్, పారామౌంట్ ప్లేయర్స్, పారామౌంట్ యానిమేషన్స్, సీబీఎస్ స్టూడియోస్, సీబీఎస్ మీడియా వెంచర్స్, సీబీఎస్ న్యూస్, షో టైం నెట్‌వర్క్, నికిలోడియన్, ఎంటీవీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్, మిరామాక్స్ వంటి ఎన్నో బ్రాండ్‌లతో ముందుకు దూసుకుపోతోంది. క్రైమ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్, స్టార్ ట్రెక్, స్పాంజ్‌బాంబ్ స్క్వేర్ పాంట్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్ వంటి ఎన్నో అద్భుతమైన సీరిస్‌లను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇంటర్నేషనల్ కో ప్రొడక్షన్, లోకల్ ప్రొడక్షన్‌లోని స్క్రిప్ట్డ్, అన్ స్క్రిప్ట్డ్ ఫార్మాట్‌లోని ఎన్నో ప్రాజెక్ట్‌ల లైసెన్స్ కలిగి ఉంది. వయకామ్ సీబీఎస్ ఇంక్ సంస్థలోని ఓ భాగమే వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్.

About Netflix:
(నెట్‌ఫ్లిక్స్‌ గురించి)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడింగ్‌ ఓటీటీ సంస్థల జాబితాలో ముందువరుసలో ఉన్న స్ట్రీమింగ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌. 190 దేశాల్లో 208 మిలియన్ల పెయిడ్‌ మెంబర్‌షిప్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. డాక్యూమెంటరీలు, టీవీ సిరీస్‌లు, ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇలా భిన్నరకాలైన వినోదాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తమ వ్యూయర్స్‌కు అందిస్తుంది. ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న ఓ స్క్రీన్‌పై అయిన…ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను పొందవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి – గాడ్ ఫాదర్

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ గాడ్ ఫాదర్ ఊటీ షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.

మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి
తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు.

తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్ఫణ : కొణిదెల సురేఖ
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం : ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫర్ : నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావ్
పీఆర్వో : వంశీ-శేఖర్

1 230 231 232 233 234 235