క్రేజీ ఆఫర్ దక్కించుకున్న బుచ్చి బాబు…

సీనియర్ హీరోను లైన్లో పెట్టిన బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఉప్పెన” .. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ , హీరోగా లాంచ్ చేస్తూ , అలానే సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో ఒకరు అయిన డైరెక్టర్ బుచ్చి బాబు ఉప్పెన సినిమా తోనే ఇద్దరు టాలీవుడ్ కి పరిచయము అయ్యారు .. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు దర్శకుడు బుచ్చిబాబు .. ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు మరొక సినిమా ఎనౌన్సమెంట్ చేయలేదు .. మొదటి సినిమా తోనే భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు , ఆ తరువాత ఏ స్టార్ హీరోతో సినిమా ఎనౌన్సుమెంట్ చేస్తారో అన్న విషయము ఫై ఎటువంటి క్లారిటీ లేదు .. జనాలు కరోనా భయం ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే థియేటర్లకు వస్తారని ఉప్పెన సినిమా నిరూపించింది. గత ఏడాదిలోనే రావాల్సిన ఉప్పెన కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. మంచి సమయంలో విడుదల అయిన ఉప్పెన వంద కోట్లకు పైగా రాబట్టింది. ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కొందరు నిర్మాతలు డైరెక్టర్ బుచ్చిబాబు కి అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ..బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటీ అంటే అంతా ఒకే మాట చెప్తున్నారు… ఎన్టీఆర్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా రాబోతుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..

సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా గురించి గత కొన్ని రోజులు గా న్యూస్ బాగా వైరల్ అయింది .. తాజాగా ఈ కాంబినేషన్ గురించి మరోసారి న్యూస్ వినిపిస్తుంది .. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన ఓకే చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది .. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని తెలుస్తుంది .. ఎన్టీఆర్ కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ..ఎన్టీఆర్ తో డైరెక్టర్ బుచ్చి బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. మొత్తానికి ఉప్పెన సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తారక్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ డైరెక్టర్ బుచ్చుబాబు సిద్దంచేసుకున్నారు .. మరి డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …