బుచ్చిబాబు,ఎన్టీఆర్ మూవీ లేటెస్ట్ న్యూస్…

సోషల్ మీడియా లో రెగ్యులర్ గా వినిస్తున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్...
             

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల గురించి ప్రేక్షకులు అందరూ మాట్లాడుకుంటారు .. సుకుమార్ డైరెక్షన్ టీమ్ నుండి ఒక్కొక్కరు డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు .. కుమారి 21 f సినిమా తో డైరెక్టర్ పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్ గా పరిచయము అయి సక్సెస్ అందుకున్నాడు .ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు గురించి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు .. రెగ్యులర్ సినిమాల కు దూరంగా ఉంటూ డైరెక్టర్ బుచ్చిబాబు తెరెకెక్కించి న ఈ సినిమా ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగిపోయింది .. ఉప్పెన సినిమా లో డైరెక్టర్ సున్నితమైన పాయింట్ ని డీల్ చేసిన విధానానికి ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లీమెంట్స్ దక్కాయి ..

ఇక వివరాల్లోకి వెళ్ళితే ఉప్పెన వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీ గురించి ఎనౌన్సుమెంట్ చేయలేదు .. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి , కానీ బుచ్చిబాబు మాత్రం ఆచి తూచి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు . చిన్న సినిమాతో భారీ హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని గతంలో కూడా వార్తలు వినిపించాయి . సుకుమార్ శిష్యుడిగా నాన్నకు ప్రేమతో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు తో ఎన్టీఆర్ మంచి సాన్నిహిత్యం ఉంది .. అప్పటి నుండి ఎలాగైనా సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకున్నాడు కాబట్టి నెక్స్ట్ సినిమా తారక్ తోనే అని గట్టిగ ఫిక్స్ అయ్యేరు.

బుచ్చిబాబు చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ దగ్గరనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది .. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉన్నది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు .. అయితే కొరటాల శివ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉండనుంది ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని.. ఈ సినిమాలో తారక్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది . ఇందుకోసమే ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగి చబ్బీ లుక్ లోకి మారారని అంటున్నారు. మరి దీని పై వస్తున్న వార్తల్లో క్లారిటీ తెలియాలంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే ..