వ‌న‌ప‌ర్తిలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కొత్త కార్యాల‌యం

New office of HDFC Limited in wanaparthi

తెలుగు సూపర్ న్యూస్,వ‌న‌ప‌ర్తి, మార్చి 10, 2023: దేశంలోని ప్ర‌ముఖ గృహ రుణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ వ‌న‌ప‌ర్తిలో కొత్త కార్యాల‌యం ప్రారంభించ‌డం ద్వారా తెలంగాణ‌లో త‌న ఉనికిని మ‌రింత బ‌లోపేతం చేసుకుంది. ఈ కొత్త కార్యాల‌యం చిరునామా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, మునిసిప‌ల్ నెం. 7-54/2 & 7-54/3, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీ‌నివాస్‌పూర్‌, పెబ్బేరు రోడ్డు, వ‌న‌ప‌ర్తి 509103. ఇది తెలంగాణ‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ వారి 26వ కార్యాల‌యం.

ఈ కొత్త కార్యాల‌యం వ‌న‌ప‌ర్తి, చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు త‌మ క‌ల‌ల ఇంటిని సొంతం చేసుకోడానికి గృహ‌రుణాలు పొందేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త కార్యాల‌యం వ‌న‌ప‌ర్తి న‌డిబొడ్డున ఉంది, ఈ కొత్త కార్యాల‌యాల‌ను ఎంపిక చేసేట‌ప్పుడు క‌స్ట‌మ‌ర్ల సౌకర్యానికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చాం.

ఈ కొత్త కార్యాల‌యం సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 5.15 వ‌ర‌కు తెరిచి ఉంటుంది. శ‌నివారాల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌తినెలా మూడో శ‌నివారం సెల‌వు.

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ బిజినెస్ హెడ్ రాజన్ టాండన్ వ‌న‌ప‌ర్తిలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్,రేణుసూద్ కర్నాడ్ మాట్లాడుతూ, “వ‌న‌ప‌ర్తి తెలంగాణ‌లో చాలా ముఖ్య‌మైన జిల్లా కేంద్రం. ఈ జిల్లాలో వ్య‌వ‌సాయం, మైనింగ్‌, వ‌స్త్రప‌రిశ్ర‌మ‌, ఎంఎస్ఎంఈల లాంటి  అనేక ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి.  ఈ న‌గ‌రంలో ఇటీవ‌ల ఆర్థిక కార్య‌క‌లాపాలు గ‌ణ‌నీయంగా క‌న‌ప‌డుతున్నాయి. అందువ‌ల్ల ఇక్క‌డ వృద్ధికి అపార‌మైన అవ‌కాశాలున్నాయి. న‌గ‌రం, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఇళ్ల‌కు డిమాండు భారీగా ఉంటుంది. ఈ కొత్త కార్యాల‌యం కస్టమర్లతో మా సంబంధాన్ని మరింత లోతుగా పెంపొందించుకోవడానికి మాకు సహాయపడుతుంది. ఇంటి రుణాలను సౌకర్యవంతంగా పొందడానికి వారికి ఉప‌యోగ‌ప‌డుతుంది” అని చెప్పారు.

దీని గురించి ఆమె మ‌రింత వివ‌రిస్తూ, “హెచ్‌డీఎఫ్‌సీ ఎప్పుడూ సొంత ఇల్లు ఉండాల‌నే భావనను ప్రోత్సహిస్తుంది. ఇళ్లు అవ‌స‌రం ఉన్న‌వారికి మరింత సమర్థవంతంగా సేవలందించాలంటే ఎవ‌రికి వారికి వ్య‌క్తిగ‌త కౌన్సెలింగ్ ఇవ్వ‌డం చాలా అవసరం అనే వాస్తవాన్ని గుర్తించింది. మా కొత్త కార్యాలయం హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌వ‌ర్క్‌ లో ఈ ప్రాంత ప్రాముఖ్యతను సూచిస్తుంది. నిజమైన ఇంటి కొనుగోలుదారుల పెద్ద మార్కెట్‌ను చేరుకోవడం, సమాచారంతో కూడిన ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం” అని తెలిపారు.

కస్టమర్ తమ గృహ‌రుణ ఖాతాను సుల‌భంగా నిర్వహించడంలో సహాయపడటానికి హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ సేవలను ప్రారంభించింది. రుణాలు, రిటైల్ డిపాజిట్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ ఆన్ లైన్ డిజిటల్ ప్లాట్ ఫారంపై దృష్టి సారించింది. కస్టమర్ల నుంచి అభ్యర్థనలన్నింటి కోసం ‘హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కనెక్ట్’ని ప్రారంభించింది. కొవిడ్ -19 మహమ్మారికి ముందు 20% కంటే తక్కువ ఉన్న కొత్త రుణ దరఖాస్తులలో నేడు 94% కంటే ఎక్కువ డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో గృహ రుణాల విష‌యంలో ఆన్‌లైన్ రుణ ప్రాసెసింగ్ చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టిపెట్టిన మొద‌టి సంస్థ హెచ్‌డీఎఫ్‌సీయే. డిజిటల్ చొరవలపై హెచ్‌డీఎఫ్‌సీ దృష్టి, గృహనిర్మాణం కోసం డిమాండ్ ఊహించిన దానికంటే వేగంగా సాధారణ స్థితికి రావడానికి సహాయపడింది. 2022 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.2 లక్షల కోట్లకు పైగా రిటైల్ గృహ రుణాలను ఆమోదించే మైలురాయిని సాధించడంలో కీలక పాత్ర పోషించింది, ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంత ఎక్కువ.

డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో, వాల్యూమ్ పరంగా ఆమోదించిన‌ గృహ రుణాలలో 23%, విలువ పరంగా 10% ఆర్థికంగా బలహీనవర్గం (ఇడబ్ల్యుఎస్), అల్పాదాయ వర్గాల (ఎల్ఐజి) వినియోగదారులకు వచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తుంది. వివిధ వ్యక్తిగత అవసరాలు, న్యాయ‌, సాంకేతిక సాయం కోసం ఉచిత ప్రాపర్టీ కౌన్సెలింగ్ సేవలను అందిస్తుంది. రుణాలను వేగంగా ఆమోదించే సామర్థ్యాలను కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించిన‌ అవగాహన, పరిజ్ఞానంతో హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తి సంబంధిత సమస్యలపై వినియోగదారులకు సలహా ఇస్తుంది. ఇది కేవలం ఫైనాన్స్ మాత్రమే కాకుండా, కస్టమర్ల హౌసింగ్ అవసరాలకు ఒక సంపూర్ణ పరిష్కారాన్ని అందించేలా ఎదిగింది. ఎందుకంటే మనలో చాలామందికి ఇంటిని కొన‌డం అతి పెద్ద పెట్టుబడి, జీవితకాల నిర్ణయం.

New office of HDFC Limited in wanaparthi

కస్టమర్ల కోసం రూపొందించిన‌ సృజనాత్మక ఉత్ప‌త్తులు:

  • గృహ రుణాలు
  • గృహ మెరుగుదల రుణాలు
  • గృహ విస్త‌ర‌ణ రుణాలు
  • ప్లాట్ రుణాలు
  • గ్రామీణ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు
  • హెచ్‌డీఎఫ్‌సీ  రీచ్
  • ఎన్ఆర్ఐలకు రుణాలు
  • ఆస్తిపై రుణం
  • పాత కస్టమర్ల కోసం టాప్ అప్ రుణాలు
  • కస్టమైజ్ చేసిన చెల్లింపు ఆప్షన్లు

Leave a Reply