మహిళా ప్రతినిధుల కోసం జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్‌ పై జాతీయ మహిళా కమిషన్ శిక్షణా కార్యక్రమం   

NCW
NCW

ఢిల్లీ,జూన్ 23,2022: జాతీయ మహిళా కమిషన్ (NCW) ‘షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్’ ప్రాజెక్ట్ కింద ఎన్నికైన మహిళా ప్రతినిధుల (MLAల) కోసం జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్‌ పై వర్క్‌షాప్‌ను నిర్వహించింది, ఇది మహిళా ప్రతినిధుల నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం కమిషన్ ఉద్దేశించిన పాన్-ఇండియా స్థాయి సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) నేషనల్ జెండర్ అండ్ చైల్డ్ సెంటర్ సహకారంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో 2022 జూన్ 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు వర్క్‌ షాప్ నిర్వహించనున్నారు.

NCW

వర్క్ షాప్ సందర్భంగా, మహిళా ఎమ్మెల్యేలు ‘ప్రభావ నాయకత్వం’, ‘ఇన్‌క్లూజివ్ గవర్నెన్స్’, ‘స్త్రీలు, యుక్తవయస్కుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టితో లింగ-ఆధారిత హింసపై అవలోకనం’, ‘జెండర్ సెన్సిటివ్ అండ్ ఇన్‌క్లూజివ్ కమ్యూనికేషన్’, ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’, వంటి విభిన్న సెషన్‌లలో శిక్షణ ఇస్తారు, ఈ వర్క్‌ షాప్‌ లో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 29 మంది పాల్గొంటున్నారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈరోజు ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రారంభ ప్రసంగంలో, ఆమె తన విలువైన అనుభవాలు, నిజ జీవిత ఉదాహరణలతో మహిళా ఎమ్మెల్యేలను ప్రేరణ కలిగించారు. ప్రజాప్రతినిధి జీవితంలో క్రమశిక్షణ ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సమర్థవంతమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి అట్టడుగు స్థాయి ముఖ్యంగా గ్రామ పంచాయతీ అధికారులతో మెరుగైన సమన్వయం చాలా ముఖ్యమని ఆమె తన ప్రసంగంలో అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ‘సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ దిశగా కృషి చేయాలని పాల్గొనేవారికి చెప్పారు.

NCW

ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ తన ముఖ్యోపన్యాసం చేస్తూ, ‘సాధికారత కలిగిన మహిళా నాయకత్వం, సాధికారత ప్రజాస్వామ్యం’ అనే ఆలోచనతో ఈ వర్క్‌ షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా నాయకుల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘షీ ఈజ్ ఎ చేంజ్‌మేకర్’ ప్రాజెక్ట్ కింద, కమీషన్ మహిళా ప్రతినిధుల కోసం నిర్ణయాధికారం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్ మొదలైనవాటిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాంతీయ శిక్షణా సంస్థలతో కలిసి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కమిషన్ 49 శిక్షణ కార్యక్రమాలను ఇప్పటివరకు నిర్వహించింది. ఎనిమిది రాష్ట్రాల్లోని బ్యాచ్‌ల కింద ఇప్పటి వరకు దాదాపు 1700 మంది పంచాయతీరాజ్ సంస్థలు/పట్టణ స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులు శిక్షణ పొందారు.

Leave a Reply