జనగణమన మొదలు పెట్టిన విజయ్ … పూరి

బాక్సర్ నుండి ఆర్మీ ఆఫీసర్ లుక్ లోకి మారిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ…

రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , క్రియేటివ్ గా సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒకరు .. పూరి డైలాగ్స్ , హీరో క్యారెక్టరైజేషన్ , హీరో కి ఒక డిఫరెంట్ మ్యానరిజమ్స్ క్రియేట్ చేయాలన్న , ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సృష్టించాలి అన్నా అది కేవలం డైరెక్టర్ పూరీ కె సాధ్యం .. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో సినిమాలు గురించి చెప్పాలి అంటే శివ సినిమాకు ముందు శివ సినిమా తరువాత అని అనేవారు , కానీ ఇప్పుడు ఇప్పుడు పూరీ జగన్నాధ్ రాకముందు , పూరీ జగన్నాధ్ వచ్చినా తరువాత అని అంటున్నారు ..

పూరీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కంటిన్యూ గా చేస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు బాడ్ రివ్యూస్ వచ్చాయి .. దాంతో పూరీ జగన్నాద్ టైమ్ అయిపోయింది అని అనుకున్నారు ప్రేక్షకులు , ఈ కామెంట్స్ పూరీ ని చాలా బాధపెట్టాయి , అలానే పూరీ మధ్యలో ఫైనాన్షియల్ గా కూడా కొన్ని సమస్యలు ఎదురుకొన్నారు .. అయితే పూరి పెన్ పవర్ మాత్రం తగ్గలేదు . 2019 లో డైరెక్టర్ పూరీ – ఎనర్జిటిక్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇస్మార్ట్ శంకర్ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

ఇక అసలు విజయానికి వెళ్ళితే .. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ – విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమా గా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నారు .. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మరో మెట్టు ఎక్కుతున్నాడు .. ఈ క్రమంలో లైగర్ మూవీ తరువాత డైరెక్టర్ పూరీ నెక్స్ట్ మూవీ ఏమిటి అనే బుజ్ సోషల్ మీడియా లో క్రియేట్ అయింది .. అసలు పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన మూవీ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరిగింది .. అసలు పూరీ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ – జన గణ మన మూవీ మహేష్ బాబు తో తెరకెక్కిద్దాం అని అనుకున్నారు , కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ..’విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుగుతుంది .. ఈ క్రమంలో మల్లి పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన” మూవీ ఏ స్టార్ హీరోతో ఈ మూవీ తెరకెక్కుతున్నదో అనే వార్తలు సోషల్ మీడియా లో బాగా వినపడినాయి .. అయితే ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి డైరెక్టర్ ఫుల్ స్టాప్ పెడుతూ .. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ తో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేసాడు .. ఇది పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం… విజయ్ దేవరకొండ లాంటి పెర్ఫామర్‌ హీరోగా ఉండటంతో.. సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా ఉన్నాయి .. . ఈ సినిమా కథకు సంబంధించి ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇదొక ఫిక్షన్ కథ అని చెప్పిన పూరి జగన్నాథ్… తన దేశం కోసం, తన దేశ పౌరుల కోసం ఒక సైనికుడు కనే కలనే ఈ సినిమా అని తెలిపారు. దేశభక్తి, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా చేయాలని చాలా ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని… విజయ్ దేవరకొండ వల్ల ఇన్నాళ్లకి ఆ కల నిజం కాబోతోందని చెప్పారు.

ఇదే ప్రెస్ మీట్‌లో నటి, నిర్మాత చార్మి మాట్లాడుతూ.. జన గణ మన సినిమాలో పూర్తి భిన్నమైన విజయ్ దేవరకొండను చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ఎగ్జయిటింగ్ అనిపించిందని.. ఇందులో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

. విజయ్ సబ్జెక్ట్‌కి పర్ఫెక్ట్ అని భావించడంతో అతనితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న జన గణ మన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు పూరి ప్రకటించేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదలకు ముందే.. మరో మూవీ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది..