లేటెస్ట్ ఫీచర్స్ తో నూతన వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టిన హోండా
తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,19ఫిబ్రవరి 2023 : భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ, స్కూటర్ విభాగంలో దూసుకువెళుతున్న హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) స్మార్టర్, అత్యాధునిక యాక్టివా 2023ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది హెచ్‌ఎంఎస్‌ఐ మొట్టమొదటి ఓడీబీ2 ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనం. ఏప్రిల్ 2023 గడువుతేదీ కంటే ముందుగానే దీనిని విడుదల చేసింది.
హైదరాబాద్‌లో జరిగిన నూతన యాక్టివా విడుదల కార్యక్రమంలో తెలంగాణా జోనల్ మేనేజర్ ఇస్మాయిల్ ఖాన్, హైదరాబాద్ ఏరియా మేనేజర్ సునీల్ రెడ్డి, హైదరాబాద్ ఏరియా మేనేజర్ పునీత్‌కుమార్ సీ ఎస్‌తో పాటుగా హైదరాబాద్‌లోని హోండా డీలర్లు పాల్గొన్నారు.
సాంకేతికత పరంగా ముందుండే, హెచ్‌ఎంఎస్‌ఐ తమ వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యాన్ని వారి రోజువారీ జీవితాలలో అందిస్తుంది. ద్విచక్ర వాహన విభాగంలో మొట్టమొదటిసారిగా వినూత్నమైన ఫీచర్-హోండా స్మార్ట్ కీ ని నూతన యాక్టివాలో విడుదల చేసింది.
నూతనంగా విడుదలైన యాక్టివా అన్నిహోండా డీలర్షిప్ కేంద్రాల వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇండల్జెన్స్ ఈవెంట్స్ , ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది.