గోపీచంద్ మలినేని – బాలయ్య సినిమా లేటెస్ట్ అప్ డేట్

2021 లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా “క్రాక్” . క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు ఏవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు , సాలిడ్ కంటెంట్ , రవితేజ పవర్ ఫుల్ యాక్షన్ , గోపీచంద్ మలినేని టేకింగ్ , తో , ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. డైరెక్టర్ గోపీచంద్ మలినేని అప్పటివరకు తానూ చేసిన సినిమాలు సో సో గా ఉన్న క్రాక్ సినిమాతో ఒక్కసారిగా బిగ్గెస్ట్ హిట్ అందుకొని , ఇండస్ట్రీ లోని అందరి ప్రశంసలు అందుకున్నారు .. క్రాక్ సినిమా తరువాత , డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొంత గ్యాప్ తీసుకొని నందమూరి బాలకృష్ణ సినిమా ఎనౌన్స్ చేయడం జరిగింది.. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా పూర్తి అయింది .. ఈ సినిమా తరువాత బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కనుంది , ఈ సినిమా ఎనౌన్స్ చేయాగానే బాలయ్య అభిమానుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా గోపీచంద్ మలినేని సినిమా టేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. క్రాక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా బాగుంది , అలానే రియలిస్టిక్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది .. క్రాక్ సినిమాలో ఒంగోలు బ్యాక్ డ్రాప్ తీసుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్య బాబు కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేసాడు అన్నది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి గా ఉంది .. . ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే అనే టాక్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది. వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించ‌డానికి క‌థ‌ను సిద్ధం చేశారు.. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తోంది ..ఈ సినిమా పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని సోషల్ మీడియా లో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రోల్స్ చేస్తున్నారు. ఒకటి ఫ్యాక్షనిట్ గా మాస్ లుక్ లో కనిపించనుండగా.. మరోకటి యంగ్ లవర్ బాయ్ గా తన లుక్స్ తో ధియేటర్స్ లో అభిమానుల అలరించబోతున్నట్లు తెలుస్తుంది .. ఈ సినిమాకి డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని టైటిల్ జై బాల‌య్య‌’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి ..ప్రస్తుతము బాలయ్య – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న అఖండ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చాలా స్పీడ్ గా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. అఖండ సినిమా తరువాతనే బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కనుంది , అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు .ఈ సినిమా టైటిల్ విషయంలో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం ఉందొ తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలిసిందే

Leave a Reply