జనని ఫౌండేషన్ అండ్ శ్రీమహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ కోర్సులు ప్రారంభం..

ముఖ్యాతిథిలుగా హాజరైన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర, కుమారస్వామి, నటుడు సుమన్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,జనవరి 5,2023: జనని ఫౌండేషన్ అండ్ శ్రీమహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటిషన్ శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి. అమీర్ పేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ లు హాజరయ్యారు.

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. మహిళలు వంటింటికే పరిమితం కారాదని ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో వారుకూడా రాణిస్తున్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు.

మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి.. సొంతగా వ్యాపారం ప్రారంభించేందుకు మెలుకువలు అందించడంతోపాటు వారికి మద్దతు గా నిలుస్తున్నారు. స్వయం ఉపాధి కోర్సుల్లో పలువురు నిష్ణాతులతో ట్రైనింగ్ అందించి తీర్చి దిద్దనున్నారు. శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనని ఫౌండేషన్ అండ్ శ్రీమహిళా సంక్షేమ సంఘం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గంగాపురం పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply