బాలయ్యకి విలన్ గా కన్నడ స్టార్ …

గోపీచంద్ మలినేని - బాలయ్య సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ... 

2021 లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చివరి హ్యాట్రిక్ సినిమా “క్రాక్” . క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు ఏవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు , సాలిడ్ కంటెంట్ , రవితేజ పవర్ ఫుల్ యాక్షన్ , గోపీచంద్ మలినేని టేకింగ్ , తో , ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . డైరెక్టర్ గోపీచంద్ మలినేని 2021 బాగా కలిసి వచ్చింది .. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాకా హీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. బాలకృష్ణ ను పవర్ ఫుల్ అండ్ మాస్ గా చూపించాలి అంటే , ఒక్క బోయపాటి శ్రీను ఒక్కరే అని ఇండస్ట్రీ టాక్ .. గోపీచంద్ మలినేని డాన్ శ్రీను సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి క్రాక్ సినిమా తో హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు …ప్రస్తుతము బాలకృష్ణ – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న అఖండ సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది . అఖండ సినిమా తరువాత బాలకృష్ణ వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , అయితే ముందుగా వాటిలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా అఫీషియల్ గా లాంచ్ చేశారు .. ఒక డిఫెరెంట్ కాంబినేషన్ , డైరెక్టర్ గోపీచంద్ మలినేని , రవితేజ తో మూడు సినిమాలు , సీనియర్ హీరో వెంకేటేష్ తో ఒక సినిమా , మరియు హీరో రామ్ పోతినేని తో ఒక సినిమా చేశారు , కానీ క్రాక్ సినిమా హిట్ తో ఒక్కసారి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది .. గోపీచంద్ – బాలకృష్ణ సినిమా ఎనౌన్సుమెంట్ వినగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి …

డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదటి సారిగా బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది , బాలయ్యను తమ అభిమానులు ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో , అలా చుపించాడానికి , స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి రోజా ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. గోపీచంద్ మలినేని – ముందుగా ఈ సినిమా లో విలన్ క్యారెక్టర్ కోసం తమిళ్ స్టార్ హీరో విజయ సేతుపతి అయితే బాగుటుంది అని ఫిక్స్ అయ్యారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. బాలయ్య బాబు – పక్కన విలన్ రోల్ చెయ్యాలి అంటే చాలా గట్స్ ఉండాలి , అలానే బాలయ్య బాబు తో ఢీ అంటే ఢీ అనేలా పవర్ ఫుల్ గా విలన్ రోల్ ఉండాలి , డైరెక్టర్ గోపీచంద్ మలినేని విలన్ రోల్ కోసం చాలా పేర్లు ముందుగా అనుకున్నారు .. ఈ సినిమా , కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నది .. ఈ సినిమా లో విలన్ రోల్ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది , బాలకృష్ణ ఢీ కొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ ని ఎంపిక చేసిందట యూనిట్. …. కన్నడలో పలు సినిమాల్లో నెగటివ్ రొల్స్ చేసి మంచి పేరు అందుకున్న విజయ్, తొలిసారిగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ నటిస్తున్నారు అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే కొద్దీ రోజులు ఆగలిసిందే …