ఆర్ధిక అక్షరాస్యత అందించేందుకు భాగస్వామ్యం చేసుకున్న డిబిఎస్, హెచ్ఇఎస్పిఎల్

తెలుగు సూపర్ న్యూస్,మార్చి13,2023: రోజువారీ వేతన, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలతో సహా భారతదేశంలోని అట్టడుగు వర్గాల కోసం సామాజిక రక్షణ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టేందుకు డిబిఎస్ ఫౌండేషన్, హక్దర్శక్ ఎంపవర్మెంట్ సొల్యూషన్స్ (హెచ్ఇఎస్పిఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ఆర్థిక సేవలను అందుకునేలా చేయడానికి వారి డిజిటల్, ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవగాహన కల్పిస్తుంది.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు తెలంగాణలలోని 10 జిల్లాలలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు, ఈ ప్రాంతాలలో అత్యంత అట్టడుగు జనాభాను లక్ష్యంగా చేసుకుంది. ఈ పౌరుల కోసం ప్రాథమిక సామాజిక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం వారి జీవితాలు, కుటుంబాలకు బాధ్యత వహించడానికి డిజిటల్ ఆర్థిక శిక్షణతో సాధాకారత కల్పించడం.


ఈ కార్యక్రమ అంతిమ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన కమ్యూనిటీలలో యోజన కేంద్రం కేంద్రం స్థాపించడం జరుగుతుంది. కమ్యూనిటీకి సేవ చేయడానికి, మద్దతు ఇవ్వడానికి మహిళా ఏజెంట్లను గుర్తించి, హక్దర్శకులుగా శిక్షణ ఇస్తారు. ఈ ఏజెంట్ల శ్రేణి.. తక్కువ–ఆదాయ కుటుంబాల నుండి, అంటే అత్యల్ప సామాజిక రక్షణ, ఆర్థిక సేవలు కలిగిన లబ్ధిదారుల్ని సమీకరిస్తుంది.

ఈ సహాయక ఏజెంట్లు ఆడియో–విజువల్ టూల్స్ , స్థానిక భాషల్లో సులభంగా అర్థం చేసుకోగలిగే కంటెంట్‌ని ఉపయోగించి ఆర్థిక అక్షరాస్యత శిక్షణా శిబిరాలను నిర్వహిస్తారు. సంక్షేమ కార్యక్రమాలకు వారి అర్హతను నిర్ధారించడానికి లబ్ధిదారుల్ని హక్దర్శక్ మొబైల్ యాప్‌తో పరీక్షించడం జరుగుతుంది. ఏజెంట్ ఫారమ్‌లను పూరించడానికి, పత్రాలను సేకరించడానికి సామాజిక రక్షణ కార్యక్రమాల కింద లబ్ధిదారులను నమోదు చేయడానికి అవసరమైన రీతిలో తొలి నుంచీ తుది వరకూ మద్దతును అందిస్తారు. ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదుల పరిష్కారానికి హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం 400 మంది సహాయక ఏజెంట్ల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి 40 మంది ఏజెంట్లకు ఒక సూపర్వైజర్ ఉంటారు.

గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ ఎక్సలెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం, భారతీయ వయోజనులలో ఆర్థిక అక్షరాస్యత రేటు ఇతర ప్రధాన అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యల్పంగా ఉంది, కేవలం 24% మంది మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులుగా ఉన్నారు. ఈ అసమానత అధికారిక శిక్షణ, అవగాహన అవసరం, అలాగే అంతర్–రాష్ట్ర వ్యత్యాసాలకు కారణమైంది. సాంఘిక సంక్షేమం ఆర్థిక సేవలను పొందడం ఒక క్లిష్టమైన సవాలు. గత 2017 ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, 40 శాతం మంది భారతీయులు మాత్రమే ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోగలరు, మరోవైపు మహమ్మారి నేపథ్యంలో అట్టడుగు వర్గాలు ఆర్థిక కష్టాలతో పోరాడుతూన్న కీలక సమయంలో ఈ సహకారం అందుబాటులోకి వస్తోంది.

ఈ సందర్భంగా డిబిఎస్ బ్యాంక్ ఇండియా గ్రూప్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ – కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షోమా నారాయణన్ మాట్లాడుతూ, ‘సామాజిక బాధ్యత కలిగిన బ్యాంక్‌గా, బ్యాంకింగ్‌కు మించిన ప్రభావాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని గుర్తించాం. హక్దర్శక్తో మా భాగస్వామ్యం అట్టడుగు వర్గాలకు, ప్రత్యేకించి మహిళలకు సామాజిక సంక్షేమం ఆర్థిక సాధనాలను అందిస్తుంది. తద్వారా వారికి స్వావలంబనను పెంపొందించేలా ఏజెన్సీని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించేందుకు సమిష్టి కృషి చేస్తోంది. డిబిఎస్ ఫౌండేషన్ గ్రాంట్ ప్రోగ్రామ్ క్రింద మంచి భవిష్యత్తును నిర్మించాలనే మా ఉద్దేశ్యాన్ని పంచుకుంటుంన్నందుకు హక్దర్శక్ విషయంలో గర్విస్తున్నాం’’ అని అన్నారు.

హక్దర్శక్ వ్యవస్థాపకుడు – సిఇఒ అనికేత్ దోగర్, మాట్లాడుతూ ‘‘డిబిఎస్ ఫౌండేషన్ 2018 నుంచి మా ప్రారంభ భాగస్వామి. , మహమ్మారి సమయంలోనూ, ఇప్పుడు కూడా. తొలి రోజుల్నించి మమ్మల్ని ప్రోత్సహించడంలో ముందున్నారు. – డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత శిక్షణ ఇచ్చి, సంబంధిత సంక్షేమ అర్హతలకు అనుసంధానం ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాలలోని 2,00,000 మంది వారిలోనూ ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలగించనున్నాము. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మాతో సహకరించినందుకు డిబిఎస్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవాలని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Leave a Reply