చిరంజీవి కోసం వస్తున్న సల్లూ భాయ్…

గాడ్ ఫాదర్ సినిమా లో పవర్ ఫుల్ రోల్ లో సల్మాన్ ఖాన్

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “ఆచార్య ” ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత , చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీస్తున్నారు , కొరటాల శివ సినిమాలకు ఒక మార్కు ఉంటుంది , ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు . ఈ క్రమంలో ఆచార్య సినిమా తరువాత , మోహన్ రాజా డైరెక్షన్ లో ఒక సినిమా , డైరెక్టర్ మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా , మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా లు లైన్ లో ఉన్నాయి . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి .

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఆచార్య సినిమా పూర్తి కాగానే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి ఎటెండ్ అవుతారు . మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ , మరియు కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. మెగా స్టార్ చిరంజీవి ఒకే సారి ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వెళ్లి జెట్ స్పీడ్ తో సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు .. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా గురించి ఏదోఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తున్నాయి .. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో ఒకటి వైరల్ గా మారింది .. ఈ సినిమా , ఒరిజినల్ లూసిఫర్ లో హీరో పృథ్వీరాజ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించాడు . ఇప్పుడు తెలుగు రీమేక్ లో అంతకు మించిన పవర్ ఫుల్ గా ఈ పాత్రను తీర్చిదిద్దగా ,, డైరెక్టర్ మోహన్ రాజా చాలా కసరత్తలు చేస్తున్నారు , ముందుగా ఈ రోల్ కు చాలా పేర్లు అనుకున్నారు , కానీ ఈ రోల్ కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం సంప్రదిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి .. చిరంజీవికి – సల్మాన్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి ఇది నిజం కావచ్చని మెగా అభిమానులు ఆశ పడుతున్నారు. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు అని వచ్చే వార్తల్లో నిజం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …