మరోయంగ్ డైరెక్టర్ ఛాన్స్ఇచ్చిన మెగాస్టార్…

వెంకీ కుడుముల స్టోరీకి ఇంప్రెస్ అయిన మెగాస్టార్...

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది , ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ , మలయాళంలో హిట్టయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి .. గాడ్ ఫాదర్ సినిమాతో మెగా స్టార్ చిరంజీవి మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి , వాటిలో మెహెర్ రమేష్ డైరెక్షన్ లో బోలా శంకర్, మరియు డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు …

బాబీ తో సినిమా తరువాత మెగా స్టార్ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి .. భీష్మ సినిమా తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల ఏ సినిమా ఎనౌన్సుమెంట్ చేయలేదు , భీష్మ సినిమా తో డీసెంట్ హిట్ అందుకొన్న వెంకీ కుడుముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఫైనల్ గా వెంకీ కుడుముల తన దగ్గర ఉన్న స్టోరీ తో మెగా స్టార్ చిరంజీవి కి వినిపించారు , ఈ స్టోరీ కి ఇంప్రెస్ అయినా మెగా స్టార్ , డైరెక్టర్ వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ..ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీంతో వెంకీ కుడుముల తో సినిమాకి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. భీష్మ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల కు ఇంత కాలం ఎదురుచూస్తున్నందుకు బంపర్ ఆఫర్ దక్కింది అని తెలుస్తుంది …