ఇక విరాటపర్వం మూవీ ఓటీటీ లో చుడాలిసిందేనా ???”

బాహుబలి సినిమాతో హీరో రానాకు ప్రేక్షకుల్లో మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది .. దగ్గుబాటి హీరో రానా అటు హీరోగా మరో వైపు విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు సెకండ్ హీరోగా కూడా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగా రాణిస్తున్న రానా బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు .. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ , విభిన్నమైన పాత్రలు చేయడంలో హీరో రానా ఎప్పుడు ముందు వరసలో ఉంటారు .. ఇక రానా చేసిన అరణ్య మూవీ లో రానా యాక్టింగ్ కు ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కాయి ..

.. ఇక ఈ మధ్య పవర్ స్టార్‌తో కలిసి భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సినిమాలో రానా యాక్టింగ్ కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.డ్యానియల్ శేఖర్ గా రానా యాక్టింగ్ కు ధీయేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది …

వేణు ఉడుగుల – రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విరాటపర్వం ఈ మూవీ లో హీరో రానా నక్సలైట్ గా కనిపిస్తున్నాడు .. ఇక ఈ మూవీలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా విడుదలకు మాత్రం చాలా సార్లు వాయిదా పాడుతా వచ్చింది .. కరోనా కారణంగా చాలా రోజులు వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి .. దృశ్యం 2 నారప్ప చిత్రాలని ఓటీటీలో విడుదల చేసిన సురేష్ బాబు ఈ మూవీని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విరాటపర్వం రిలీజ్ కు థియేటర్స్ దొరకకపోవచ్చు.. దాంతో కనీసం 4 నెలల సమయమైనా పట్టేలా కనిపిస్తోంది. దాంతో ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవ్వడం కాయం అంటున్నారు కొందరు విశ్లేషకులు. రానా నటించిన భీమ్లా నాయక మూవీ ట్రైలర్స్ టీజర్స్ రానా ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది , అయితే ఈ హిట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎకౌంట్ లోకి వెళ్ళిపోయింది , ఇక రానా నటించిన విరాటపర్వం మూవీ టీజర్స్ రానా ఫస్ట్ లుక్ తో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి , అయితే ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుటుంది అని కొందరు భావిస్తున్నారు . మొత్తానికి విరాట పర్వం మూవీ ఓటీటీ లో రిలీజ్ అవుతుందా , లేక ధియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే…

బుచ్చిబాబు,ఎన్టీఆర్ మూవీ లేటెస్ట్ న్యూస్…

సోషల్ మీడియా లో రెగ్యులర్ గా వినిస్తున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్...
             

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల గురించి ప్రేక్షకులు అందరూ మాట్లాడుకుంటారు .. సుకుమార్ డైరెక్షన్ టీమ్ నుండి ఒక్కొక్కరు డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు .. కుమారి 21 f సినిమా తో డైరెక్టర్ పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్ గా పరిచయము అయి సక్సెస్ అందుకున్నాడు .ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు గురించి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు .. రెగ్యులర్ సినిమాల కు దూరంగా ఉంటూ డైరెక్టర్ బుచ్చిబాబు తెరెకెక్కించి న ఈ సినిమా ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగిపోయింది .. ఉప్పెన సినిమా లో డైరెక్టర్ సున్నితమైన పాయింట్ ని డీల్ చేసిన విధానానికి ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లీమెంట్స్ దక్కాయి ..

ఇక వివరాల్లోకి వెళ్ళితే ఉప్పెన వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీ గురించి ఎనౌన్సుమెంట్ చేయలేదు .. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి , కానీ బుచ్చిబాబు మాత్రం ఆచి తూచి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు . చిన్న సినిమాతో భారీ హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని గతంలో కూడా వార్తలు వినిపించాయి . సుకుమార్ శిష్యుడిగా నాన్నకు ప్రేమతో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు తో ఎన్టీఆర్ మంచి సాన్నిహిత్యం ఉంది .. అప్పటి నుండి ఎలాగైనా సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకున్నాడు కాబట్టి నెక్స్ట్ సినిమా తారక్ తోనే అని గట్టిగ ఫిక్స్ అయ్యేరు.

బుచ్చిబాబు చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ దగ్గరనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది .. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉన్నది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు .. అయితే కొరటాల శివ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉండనుంది ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని.. ఈ సినిమాలో తారక్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది . ఇందుకోసమే ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగి చబ్బీ లుక్ లోకి మారారని అంటున్నారు. మరి దీని పై వస్తున్న వార్తల్లో క్లారిటీ తెలియాలంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే ..


ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ‘బేబీ’… పోస్టర్ రిలీజ్

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…*వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్*. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.నిర్మాత: ఎస్. కే. ఎన్నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్రచన, దర్శకత్వం: సాయి రాజేష్సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డిసంగీతం: విజయ్ బుల్గానిన్ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మఆర్ట్: సురేష్సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేనిఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టిపీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం…

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం,”శంకరాభరణం”చిత్రం విడుదలయ్యి నేటికి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యింది . కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శకత్వంలో , పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు . ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక & కేరళ ల్లో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన . శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో , ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు. ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలు గా , శ్రీ కే.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు . Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ ) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు 8 గెలుచుకుంది . ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచనాలు కార్యక్రమం చేసారు , అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. జె.వి. సోమయాజులు గార్ని అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు . అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైమ తులసి పాత్రలో లీనమైపోయింది . ప్రముఖ హాస్య నటులు శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు . ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాష తో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు . ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . 42 ఏళ్ళు గడిచినా , ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది .

ఏపీ సియం జగన్ తో చిరు భేటీ సమస్య పరిష్కారం .. దటీజ్ మెగాస్టార్

సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త జీవోను జారీ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై అందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట్లాడుతానని చెప్పారు. అప్పటి వరకు సినీ పరిశ్రమలోని వ్యక్తులేవరూ నోరు జారవద్దని సినిమా బిడ్డగా మెగాస్టార్ హితవు పలికారు. త్వరలోనే అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి… వన్ టూ వన్ మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. ఆ చర్చలో మాట్లాడిన వివరాలను వెల్లడించిన చిరంజీవి… సినీ పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు ఇక ముగిసినట్లేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు. అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను. రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు
సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు.సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా.త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు.
ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు.పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం.

తిరుపతి లో మోహన్ బాబు యూనివర్సిటీ …

ప్రముఖ నటుడు మోహన్ బాబు సినీ రంగంలోనే కాదు విద్యారంగంలోనూ సేవలందిస్తున్నారు. తిరుపతిలో విద్యానికేతన్ సంస్థలు ఏర్పాటు చేసి 30 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ ను అందించారు. తాజాగా మరో అడుగు ముందుకేసిన మోహన్ బాబు.. తిరుపతిలో తన పేరుతో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు ప్రేమతో మోహన్ బాబు యూనివర్శిటీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ” శ్రీవిద్యానికేతన్ లో వేసిన విత్తనాలు మొలకెత్తి కల్పవక్షంగా మారాయి. మీ 30 ఏళ్ల నమ్మకం, నా జీవిత లక్ష్యం సాకారమయ్యే సమయం వచ్చింది. వినూత్న విద్యాభ్యాసానికి తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. మీ ప్రేమే నా బలం. మీ మద్దతు ఎల్లప్పుడు ఇలాగే ఉంటుదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను”-

డాక్టర్ ఎం.మోహన్ బాబు

సినీనటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత…

ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1974 లో అల్లూరి సీతా రామరాజు సినిమా తో బాలనటుడు గా ఎంట్రీ… కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కలసి నటించిన ముగ్గురు కొడుకులు సూపర్ హిట్ గా నిలిచింది. రమేష్ బాబు నటించిన సినిమా లలో సామ్రాట్, ముగ్గురు కొడుకులు, బజార్ రౌడీ ఎన్కౌంటర్ సూపర్ హిట్ సినిమాలు. కృష్ణ తో కలసి నటించిన ఎన్కౌంటర్ రమేష్ బాబు చివరి చిత్రం.1976లో వచ్చిన ఈ మూవీ లో సూర్యం పాత్రలో నటించారు.సూర్యవంశం (హిందీ), అర్జున్‌, అతిథి, దూకుడు చిత్రాలను నిర్మించిన రమేశ్‌బాబు..

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్…”భోళా శంకర్” నుంచి ‘స్వాగ్ ఆఫ్ భోళా’ విడుదల…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు – చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రశ్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు


12 ఘంటల్లో 15 మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్ సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్…

తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ తమిళ ట్రైలర్ నిన్న గురువారం డిసెంబర్ 30న 6:30 నిలకు విడుదలైంది. కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న ‘వాలిమై’ ప్రపంచవ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో ఈ వ్యూస్ తో తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కానుంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే 3 నిమిషాల 5 సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు… హిందీ హిట్ ‘పింక్’ను తమిళంలో ‘నెర్కొండ పార్వై’గా తెరకెక్కించారు.అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు.

ట్రైలర్ లో ప్రతి ప్రేము గ్రాండ్ గా ఆకట్టుకుంటోంది. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తున్నాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! ‘వలిమై’ సినిమా షూటింగులో కూడా అజిత్ గాయపడ్డారు. లేటెస్టుగా విడుదల అయిన ట్రైలర్ చూస్తే ఆయన ఎందుకు గాయపడ్డారు? యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది ఆడియ‌న్స్‌కు ఈజీగా అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్, కార్తికేయ మధ్య మైండ్ గేమ్.. పోరాటాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు తమిళ ట్రైలర్‌ గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే కోటి యాభై లక్షల వీక్షణలు దక్కించుకుందని సోనీ మ్యూజిక్‌ సంస్థ వెల్లడించింది.ట్రైలర్‌ విషయానికొస్తే.. బైక్‌ ఛేజింగ్‌, పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అజిత్‌, కార్తికేయ.. ఇద్దరి లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజిత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌ హంగామా ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఉన్నట్టు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. దోపీడీలు చేసే ముఠా నాయ‌కుడుగా కార్తికేయ క‌నిపించ‌నున్నారు. ధూమ్ స్టైల్లో బైక్స్‌పై వ‌స్తూ దోపీడీలు చేస్తుంటారు. ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్ గూజ్ బ‌మ్స్ తెప్పిస్తున్నాయి. బైక్ స్టంట్స్ అన్నీ క‌ళ్లు ఆర్పినీయ‌డం లేదు. ఈ సినిమాతో కార్తికేయుకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఇటు తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషాల్లో కూడా విడుదల కానుంది. ఇది అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైతుబంధు సాయం 50,000 కోట్లు

👉8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ
దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి
👉యావత్తు దేశానికి అనుసరణీయమైన అరుదైన పథకం #రైతుబంధు పథకం

★ రైతుబంధు సాయం రూ. 50,000 కోట్లు★ 8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ★ దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి★ ఇప్పటివరకు రైతుబంధు రూ.43 వేల కోట్లు అందజేత★ యాసంగిలో 7,500 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు★ వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకం★ అవినీతికి తావులేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ★ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకొన్న రైతుబంధు★ యావత్తు దేశానికి అనుసరణీయమైన అరుదైన పథకంబీడుపడ్డ తెలంగాణ పచ్చవడాలె.. అన్నదాత దేనికోసం ఆరాటపడకుండా.. గుండెలమీద చెయ్యేసుకొని ఎవుసం చేసుకోవాలె. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పం. అందులోంచి ఆవిష్కారమైంది రైతుబంధు. అవినీతి లేదు.. హెచ్చుతగ్గులు లేవు.. గుంట జాగున్నా.. పదులకొద్దీ ఎకరాలున్నా భేదం లేదు. నిఘా నిగరానీల్లేనే లేవు. ఎకరానికి ఐదు వేలు.. ఏడాదికి రెండు కార్లు.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ. దఫ్తర్‌ లేదు.. దరఖాస్తు లేదు. ఒక్కసారి నమోదు చేసుకొంటే చాలు. ఇంకేం ఆలోచించక్కర్లేదు. నాట్లు మొదలయ్యే నాటికి ఠంచన్‌గా పైసలొచ్చి ఖాతాల్లో పడిపోతాయి. ఇప్పటికి ఏడు విడుతలైపోయాయి. ఎనిమిదో విడుత సాయం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పంపిణీతో రైతుబంధు సాయం మొత్తంగా రూ.50 వేల మార్కును దాటిపోనున్నది.పెట్టుబడి సాయం.. వినూత్నం———————రైతుకు పంట సమయంలో పెట్టుబడి అనేది చాలా కీలకం. దాని కోసం చిన్న, సన్నకారు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం.. అప్పు, దానిమీద పడే మిత్తి పులిమీద పుట్రలా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీసే దుస్థితి. ఈ క్షోభ నుంచి రైతును కాపాడటం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించి రైతులపక్షాన నిలిచారు. అంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత 2018-19 సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించడం ప్రారంభించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది ప్రభుత్వం. దీంతో రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.43 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేసింది. ప్రస్తుతం ఈ యాసంగికి పెట్టుబడిని విడుదల చేయాల్సి ఉంది. ఈ సారి రైతులతోపాటు, సాగువిస్తీర్ణం కూడా పెరగనుందని తెలుస్తున్నది. అందుకు రూ.7,500కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో రైతుబంధు పథకం రూ. 50 వేల కోట్ల మైలురాయిని దాటిపోనున్నది. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకం———————–దేశంలో ఏ ఒక్క ప్రధానీ ఆలోచించలేదు.. అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని.. ఏ ముఖ్యమంత్రీ కనీసం దృష్టిపెట్టలేదు.. అన్నదాతలను కడుపులో పెట్టుకొని కాచుకోవాలని.. కానీ తెలంగాణలో ఒకే ఒక్క నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలగన్నారు.. కడుపు నింపుతున్న కర్షకుడిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని.. అందులోంచి పుట్టిందే రైతుబంధు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఇప్పటివరకు అమలులో లేదు. ఏ ఒక్క పాలకుడి ఆలోచనకూ తట్టని పథకం. ఈ పథకాన్ని యావత్‌ భారతదేశమే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ తరహా సాయం చేయడంలో రైతుబంధును మించిన పథకం మరొకటి లేదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ లాంటివారే కొనియాడారు.ఇంతకు ముందు పెట్టుబడి కొరకు అప్పులు చేసే పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్‌ సార్‌కు రైతులపై ఉన్న ప్రేమతో రైతుబంధు ఇస్తున్నరు. రైతుబంధు కింద ఇచ్చే పైసలతోనే పంటలు వేస్తున్న. ఇంతమంచి పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.- ప్రభు, రైతు, కొత్తూర్‌(డి), కోహీర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా)ఈ సాయం ఎవరు చేయలే——————-మా అమ్మనాయిన నేర్పిన ఎవుసం పని కానుంచి నేను పంటలు సాగు చేస్తన్న. నాకు తెలిసి గిసొంటి సాయం ఏ ప్రభుత్వం చేయలే. సర్కార్లు అంటే దోచుకొనేటివి అని అనుకున్న. కానీ బువ్వ పెట్టే మా అసొంటి రైతులకు సాయం అందుతదని అనుకోలే. కేసీఆర్‌ సార్‌ ఇచ్చే సాయం శాన గొప్పది ఉల్లా. నాకు రైతుబంధు వస్తంది. రైతుబంధుకు నమస్తే.- తాడూరి కుమారస్వామి, నర్సాపూర్‌, ములుగు జిల్లాఎవుసం అల్కగయ్యింది రైతుబంధు పైసలతోని ఎరువులు, విత్తనాలు కొంటున్నం. ఇదివరకు ఎరువులు, విత్తనాల డీలర్లు కొందరు ఉద్దెర ఇచ్చేది. కానీ వాటి మీద మిత్తి వేసి ధరలు పెట్టేది. అట్ల రైతులకు మస్తు లుక్సానయ్యేది. ఇప్పుడు రైతుబంధు పైసలురాంగనే విత్తనాలు, ఎరువులు నుకచ్చుకుంటున్నం. మిత్తి రంది లేదు. ఎవుసం శానా అల్కగ అయ్యింది.- రేండ్ల శ్రీనివాస్‌, కొండన్నపల్లి, కరీంనగర్‌ జిల్లా

1 207 208 209 210 211 212