సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు అధికారిక టైర్‌ భాగస్వామిగా , రాబోతున్న టీ20 క్రికెట్‌ లీగ్‌ 2023 కోసం ఒప్పందం చేసుకున్న బీకెటీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో బీకెటీకి రెండవ సీజన్‌గా నిలుస్తుంది

తెలుగు సూపర్ న్యూస్ ,ఇండియా, 30 మార్చి 2023 : భారతీయ బహుళ జాతి కపెనీ,ఆఫ్‌–హైవే టైర్‌ మార్కెట్‌లో అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బీకెటీ) ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అధికారిక టైర్‌ భాగస్వామిగా రాబోతున్న టీ20 లీగ్‌ 2023 కోసం వ్యవహరించనుంది. ఈ 16వ ఎడిషన్‌ టీ20 2023 క్రికెట్‌ సీజన్‌ మార్చి 31,2023నుంచి ప్రారంభంకానుంది.

ఈ భాగస్వామ్యం గురించి బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ పొద్దార్‌ మాట్లాడుతూ ‘‘ఆరెంజ్‌ ఆర్మీగా గుర్తింపు పొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పట్టుదల, అంకితభావం, విజయం సాధించడానికి పడే తపన కారణంగా గుర్తింపు ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘ఎన్నడూ పట్టువదలవద్దు ’ అనే స్ఫూర్తితో మాకు సంబంధం ఉందని భావిస్తున్నాము. ఆఫ్‌ –హైవే టైర్‌ పరిశ్రమలో నూతన సంస్ధగా పోటీని మేము అర్ధం చేసుకున్నాము. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారితో కలిసి ఈ 16వ ఎడిషన్‌ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓ కె షణ్ముగం మాట్లాడుతూ ‘‘ఓ భారతీయ బహుళ జాతి సంస్ధ బీకెటీ మా అధికారిక టైర్‌ భాగస్వామిగా వరుసగా రెండవ సీజన్‌లో సైతం నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’అని అన్నారు..

Leave a Reply