భీమ్లా నాయక్ విడుదల వాయిదా?

సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల హవా. అభిమాన హీరో ల సినిమాలు విడుదల అవుతాయి. ప్రతి సంక్రాంతి కి భారీ సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఎక్కువ… ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానున్నది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే…కాని ఇప్పుడు నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం… నిర్మాతలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో భీమ్లా నాయక్ ను థియేటర్స్ లో కి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారట.

చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. కానీ ఆచార్య లో కొన్ని ఎపిసోడ్స్ ను రీ షూట్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆచార్య మార్చి నెలలో విడుదల చేయనున్నారు.
అన్నయ్య సినిమా రావాల్సిన నెలలో తమ్ముడి సినిమా విడుదల చెయ్యటానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి కొంతమంది సినీ నిర్మాతలు కలసి పవన్ కళ్యాణ్ సినిమా ను వాయిదా వేయించారు.

జనవరి 7న, ఆర్ ఆర్ ఆర్, జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్, జనవరి 15 న నాగార్జున బంగార్రాజు విడుదల కానున్నాయి.