లాలా భీమ్లా…అడవి పులి…డిజే వెర్షన్ లో విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ సాంగ్…

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతంపవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.”లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.

2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది. ‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISCసంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలిఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టిపి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీదర్శకత్వం: సాగర్ కె చంద్ర.