తగ్గేదే లే అంటున్న బోయపాటి …

అఖండ సినిమాకు లైన్ క్లియర్...

బోయపాటి శ్రీను ది – నందమూరి బాలకృష్ణ ది హిట్ కాంబినేషన్ .. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గస్ట్ హిట్స్ అందుకున్నాయి .. . బాలకృష్ణ – బోయపాటి సినిమా అంటే బాలయ్య అభిమానుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి , బాలయ్య తో సినిమా అంటేనే , బోయపాటి శ్రీను ముందు నుండి పక్కా ప్లానింగ్ తో ఉంటారు , బాలయ్యను ఎలా చూపించాలి , డైలాగ్ దగ్గర నుండి టెక్నీషియన్ , ఆర్టిస్ట్స్ , మ్యూజిక్ విషయంలో ముందు నుండి డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు .. బాలకృష్ణ ను స్క్రీన్ ముందు బోయపాటి చూపించినట్లు గా మరి ఏ డైరెక్టర్ చూపించలేరు అని నందమూరి అభిమానులు చెబుతారు .. బోయపాటి శ్రీను కెరీర్ లోనే సింహా , లెజెండ్ సినిమాలు రెండు బిగ్గెస్ట్ హిట్స్ అవ్వడమే కాకుండా – ఇటు బలకృష్ణ కు డైరెక్టర్ బోయపాటి శ్రీను కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది .. బోయపాటి శ్రీను తో ఏ స్టార్ హీరో అయిన సినిమా చేస్తే వారికి ది బెస్ట్ సినిమా ఇస్తాడు , అలానే ప్రతి హీరో ఒక్క సినిమా అయినా డైరెక్టర్ బోయాపాటి శ్రీను డైరెక్షన్ లో చెయ్యాలని కోరుకుంటాడు ..

బోయాపాటి శ్రీను – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “వినయ విధేయ రామ ” . ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచింది .. రంగస్థలం సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ , కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ బోయపాటి శ్రీను తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించారు .. సరైనోడు , జయ జానకి నాయక , సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని , రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా డైరెక్ట్ చేశారు. బోయాపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే రామ్ చరణ్ అభిమానుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి .. 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా , ఇటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఫిల్మ్ క్రిటిక్స్ నుండి ఎన్నో విమర్శలు అందుకున్నారు ..

విధేయ రామ సినిమా తరువాత , డైరెక్టర్ బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణ తో హ్యాట్రిక్ గా అఖండ సినిమా చేస్తున్నాడు .. బాలకృష తో బోయపాటి శ్రీను సినిమా ఎనౌన్స్ చెయ్యగానే , ఈ సినిమా మీద నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . బాలకృష్ణ – మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీను ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి . ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా గా రాబోతున్న అఖండ సినిమా మీద ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి . నందమూరి అభిమానులంతా ఇప్పుడు ‘అఖండ’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ , రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. …ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరగా కనిపించనున్నారు. . ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది , అయితే ఈ సినిమాను ముందుగా దసరా పండుగకి విడుదల చేయాలనే అనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి .. దసరా పండుగ కి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి , ఇక దీపావళి పండుగ కి అయిన వస్తుందేమోనని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు . మొత్తానికి ఈ సినిమాను డిసెంబరులోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి అఖండ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది అని వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …